1. కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో చేపట్టిన దిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ వేలో 246 కి. మీ. మొదటి దశ సోహ్నా దౌసా రహదారిని ప్రధాని నరేంద్రమోదీ ఏ రోజున రాజస్థాన్ లోని దౌసాలో ప్రారంభించారు?
(ఈ ఎక్స్ ప్రెస్ వే మొత్తం పొడవు 1386 కి.మీ. దిల్లీ దౌసా - లాల్సాట్ మధ్య పూర్తయిన ఈ రహదారితో ఢిల్లీ, జైపూర్ మధ్య ప్రయాణ సమయం అయిదు గంటల నుంచి రెండు గంటలకు తగ్గుతుంది. ప్రపంచంలోనే రికార్డు స్థాయి వేగంతో పూర్తవుతోన్న హైవేగా ఈ రహదారి పేరొందింది).
- 2023, ఫిబ్రవరి 10
- 2023, ఫిబ్రవరి 12
- 2023, ఫిబ్రవరి 14
- 2023, ఫిబ్రవరి 16
2
2. 2023, ఫిబ్రవరి 13న ముంబయిలో బీసీసీఐ మొట్టమొదటిసారిగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంపాటను నిర్వహిం చింది. ఇందులో అత్యధికంగా రూ.3.40 కోట్ల ధర పలికిన భారత క్రికెటర్ ఎవరు? (ఈమెను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా క్రికె టర్ ఆష్లే గార్డనర్‌ను రూ.3.20 కోట్లు వెచ్చించి గుజరాత్ జెయింట్స్ సొంతం చేసు కుంది. ఇంగ్లండ్‌కి చెందిన నటాలీ సీవరిని ముంబై ఇండియన్స్ జట్టు రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది.)
- దీప్తి శర్మ
- స్మృతి మంధాన
- జెమీమా రోడ్రిగ్స్
- హర్మన్ ప్రీత్ కౌర్
5
3. ప్రపంచంలోనే అత్యధికంగా లిథియం నిల్వలు ఉన్న మొదటి అయిదు దేశాల సరైన వరుస క్రమం ఏది?
- బొలీవియా, ఆస్ట్రేలియా, చిలీ, భారత్, చైనా
- ఆస్ట్రేలియా, బొలీవియా, చిలీ, చైనా, భారత్
- చిలీ, బొలీవియా, ఆస్ట్రేలియా, భారత్, చైనా
- బొలీవియా, చిలీ, ఆస్ట్రేలియా, చైనా, భారత్
12
4. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే యాత్రికుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది? (వీటిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్ రెడ్డి 2023, ఫిబ్రవరి 14న వర్చు వల్గా ప్రారంభించారు. సందర్శకులు ఎక్కు వగా వచ్చే ఈ ప్రాంతాల్లో కియోస్క్ లు ఏర్పాటు చేశారు. ఇవి స్థానిక పోలీస్ స్టేష న్కు అనుబంధంగా అదనపు పోలీస్ స్టేష న్లుగా పనిచేస్తాయి.)
- 30
- 10
- 20
- 50
15
5. అంతర్జాతీయ చిన్నారుల క్యాన్సర్ రోజును ఎప్పుడు నిర్వహిస్తారు?
(ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా పద్నాలుగేళ్లలోపు చిన్నారులు, 15-19 ఏళ్లలోపు కౌమారులు కలిపి నాలుగు లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. 2030 నాటికి క్యాన్సర్ బారిన పడే చిన్నారుల్లో కనీసం 60 శాతం మందిని కాపాడాలని డబ్ల్యూహెచ్ పిలుపునిచ్చింది.)
- ఫిబ్రవరి 18
- ఫిబ్రవరి 15
- ఫిబ్రవరి 13
- ఫిబ్రవరి 12
18
6. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) దేశ ఉత్తర సరిహద్దుల్లోని గ్రామాల అభి వృద్ధి కోసం వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం (వీవీపీ) పేరుతో తీసుకొచ్చిన నూతన పథకానికి కేంద్ర మంత్రివర్గం 2023, ఫిబ్రవరి 15న ఆమోదం తెలిపింది.
బి) 2022-23 నుంచి 2025-26 వరకు మూడేళ్ల కాలంలో రూ.4,800 కోట్లతో వీవీపీ పథకాన్ని అమలు చేస్తారు.
సి) ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఇందులో రూ.2,200 కోట్లను రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తారు.
డి) వీవీపీ స్కీమ్‌తో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, లద్దాఫ్)లో మౌలిక సదుపా యాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతా యని కేంద్రం వెల్లడించింది.
- ఎ, సి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
24
8. ఎన్నేళ్లు పైబడిన రోగులు కూడా ఇకపై మర ణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు తమ పేరును నమోదు చేసుకొనే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పిం చింది?
( గతంలో నిర్ణయించిన గరిష్ఠ వయో పరిమితిని సడలించడం వల్ల ఏ వయసువారైనా మరణించిన వ్యక్తుల నుంచి అవయవాలను తీసుకునేందుకు వెసులుబాటు కలిగింది. )
- 65 ఏళ్లు
- 70 ఏళ్లు
- 85 ఏళ్లు
- 35 ఏళ్లు
29
9. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశాన్ని 2023, ఫిబ్రవరి 183 నిర్వహించారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు.
బి) ఈ సందర్భంగా జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం చివరి విడతగా రాష్ట్రా లకు ఇవ్వాల్సిన రూ.16,982 కోట్లను విడుదల చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రక టించారు. ఈ మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 689 కోట్లు, తెలంగాణకు రూ.548 కోట్లు దక్కాయి.
సి) జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు అయిదేళ్లపాటు పరిహారం చెల్లిస్తామని కేంద్రం ప్రటిం చింది. ప్రస్తుత చెల్లింపుతో ఈ నిబంధన పూర్తయినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
డి) విడిగా విక్రయించే బెల్లం పానకం పై ప్రస్తుతం 18 శాతం ఉన్న జీఎస్టీని ఎత్తి వేస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. ప్యాక్, లేబులింగ్ చేసిన బెల్లం పాన కంపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. పెన్సిల్ షార్పన్స్కు విధిస్తున్న జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి చేర్చారు.
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
36
10. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 'వైఎస్సార్ లా లా నేస్తం' పథక లబ్ధిదారు లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది డబ్బులు జమ చేసింది. 2023, ఫిబ్రవరి 22న అర్హులైన 2011 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో రూ. 1,00,55,000 జమయ్యాయి.
బి) ఈ పథకం ద్వారా కొత్తగా లా గ్రాడ్యు యేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు మూడేళ్ల పాటు నెలకు రూ.5,000 చొప్పున స్టైఫండ్ అందిస్తారు.
సి) న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్‌తో 'అడ్వ కేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్'ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఉంటుంది. లా, ఫైనాన్స్ సెక్రటరీలు ఇందులో సభ్యులుగా ఉంటారు.
- ఎ మాత్రమే
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
40