1. 2023-24 కేంద్ర బడ్జెట్‌కి సంబంధించి కిందివాటిలో సరైనవి?
ఎ) శిలాజేతర ఇంధనాల వినియోగాన్ని పెంచడానికి, ప్రత్యామ్నాయ ఇంధనాల అన్వేషణకు, పర్యావరణ హితకరమైన జీవనశైలికి రూ.35,000 కోట్లు కేటాయించారు.
బి) జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌కు రూ.297 కోట్లు ప్రకటించారు.
సి) అత్యధిక సూర్యరశ్మికి అవకాశం ఉన్న లద్దాఖ్ లో 13 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన, సరఫరా వ్యవస్థకు రూ.20,700 కోట్లు కేటాయించారు.
డి) సముద్ర తీర ప్రాంతాల్లో మడ అడవుల పెంపకానికి మిషీ, చిత్తడి నేలల సమర్థ వినియోగానికి అమృత్ ధరోహర్ పథకా లను ఈ బడ్జెట్ ప్రకటించారు.
ఇ) గోబర్ ధన్ పథకంలో భాగంగా వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపద కోసం 500 ప్లాంట్లను ముఖ్యంగా 200 బయో గ్యాస్ కర్మాగారాలను నెలకొల్పడానికి ప్రోత్సాహం అందిస్తారు.
- ఎ, బి, సి, డి
- ఎ, సి, డి, ఇ
- ఎ, బి, సి, ఇ
- పైవన్నీ
4
2. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకల మధ్య ఉన్న భూభాగాన్ని దేశీయంగా రామసేతుగా, ఆడమ్స్ బ్రిడ్జ్ వ్యవహరి స్తున్నారు. దీని మీదుగా 'సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టు'ని నిర్మించాలని 2023, జనవరి 12న తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మా నాన్ని ఆమోదించింది.
బి) సేతు సముద్రం ప్రాజెక్టును 1860లో అప్పటి మెరైన్ సర్వే అధిపతి, కమాం డర్ ఏడీ టేలర్ ప్రతిపాదించారు. దీని సాధ్యాసాధ్యాలపై 1964లో నాగేంద్ర సింగ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.
సి) 2005, జులైలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ మదురైలో ఈ ప్రాజె క్టుకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో ప్రతి పాదిత వ్యయం రూ. 2427.40 కోట్లు.
డి) సేతు సముద్రం ప్రాజెక్టును ఆపేయాలని 2007లో సుప్రీంకోర్టులో పిల్ దాఖ లైంది. రామసేతుకు ఇబ్బంది కలగ కుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూడా లని కోర్టు సూచించింది.
ఇ) రాజేంద్ర కె. పచౌరి కమిటీ నివేదిక ప్రకారం, ప్రత్యామ్నాయ మార్గం పర్యావ రణ పరంగా, ఆర్ధికంగా శ్రేయస్కరం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
- ఎ, బి, సి, డి
- బి, సి, డి, ఎఫ్
- ఎ, సి, డి, ఇ
- పైవన్నీ
8
4. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ రూ. 1.10 లక్షల కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో 'న్యూ ఎనర్జీ పార్కు'ను ఏర్పాటు చేయనుంది?
(దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టు బడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశం ఆమోదం తెలిపింది.)
- కర్నూలు
- అనకాపల్లి
- పల్నాడు
- విజయవాడ
14
6. సిరియా సరిహద్దు సమీపంలో టర్కీ (తుర్కియే) ఆగ్నేయ ప్రాంతంలో 2023, ఫిబ్రవరి 6న సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎంతగా నమోదైంది? (ఈ భూకంపం కారణంగా వేలాది మంది మర ణించారు. టర్కీలో చారిత్రక గాజియన్టెప్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అనటోలియన్, అరేబియన్ భూఫలకాల మధ్య 100 కిలోమీటర్ల దూరం పైగా పగులు, ఒరిపిడితో ఈ భారీ స్థాయి భూకంపం తుర్కియే, సిరియాలను తాకింది).
- 7.8
- 7.2
- 7.6
- 7.4
21
7. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2022 అక్టోబరు - డిసెంబరు త్రైమాసి కంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వం వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా డబ్బును అందిం చింది. మొత్తం రూ. 38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని 2023, ఫిబ్రవరి 10న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు.
బి) ఈ పథకాల అర్హతకు వివాహ వయ సును అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయి లకు 21 ఏళ్లుగా నిర్ణయించారు.
సి) కనీస విద్యార్హత ఇంటర్మీడియట్.
- ఎ, సి
- ఎ, బి
- బి, సి
- పైవన్నీ
26
8. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) బ్యాటరీలు, విద్యుత్ పరికరాల తయా రీలో ఉపయోగించే అత్యంత కీలకమైన నిక్షేపాలను మనదేశంలో లిథియం తొలిసారి గుర్తించారు.
బి) జమ్మూ-కశ్మీర్ లోని రియాసి జిల్లా సలాల్ హైమన ప్రాంతంలో ఈ నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) కనుక్కుంది.
సి) 2018-19లో జీఎస్ఐ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 51 ఖనిజ క్షేత్రాలను గుర్తించారు.
డి) బంగారంతో పాటు పొటాషియం, మాలి ఙ్ఞానం ఇంకా ఇతర ప్రాథమిక లోహాల నిక్షేపాలను 11 రాష్ట్రాల్లో గుర్తించారు. జమ్మూ-కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనా డులో ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జీఎస్ఐ వెల్లడించింది.
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
32
9. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక నివే దికను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశీయంగా అన్ని రాష్ట్రాల మొత్తం నిధుల్లో 2016-17లో అభివృద్ధి పను లకు 67.6 శాతం వెచ్చించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ ఖర్చు 63 శాతానికి పడిపోయింది. అభి వృద్ధేతర కార్యక్రమాలకు వెచ్చించిన సొమ్ము 2004-05లో రూ.1.85 లక్షల కోట్లు ఉండగా, 2022-23 నాటికి అది రూ. 14.18 లక్షల కోట్లకు చేరింది.
బి) 2022-23లో అన్ని రాష్ట్రాల ద్రవ్యలోటు లక్షల కోట్లు దాటినట్లు రూ.2.15 ఆర్బీఐ పేర్కొంది.
సి) 2023-24 కేంద్ర బడ్జెట్ గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.155 లక్షల కోట్లకు చేరాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) చివర్లో అవి రూ.172 లక్షల కోట్లు దాటుతా యని ఆర్బీఐ అంచనా వేసింది.
డి) ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా 256 శాతం అప్పులున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన నివేది కలో వెల్లడించింది. వాటిలో 40 శాతం అన్ని దేశాల ప్రభుత్వాలు తీసుకున్న రుణాలే. మిగిలినవి ప్రైవేట్ సంస్థలు, ప్రజలు తీసుకున్నవి.
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
36
10. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 14వ ఏరో ఇండియా ప్రదర్శనను 2023 ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు బెంగళూరులో నిర్వహించారు.
ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
బి) అమెరికా వైమానికదళ అయిదో తరం సూపర్ సోనిక్ మల్టీకోర్ ఎఫ్ 35–ఏ శ్రేణిలోని రెండు కొత్త యుద్ధ విమానాలు ఎఫ్ 35 ఏ లైట్నింగ్ 2, ఎఫ్ 35 ఏ జాయింట్ స్ట్రైక్ ఫైటర్ లను ఈ ప్రదర్శనలో ఆవిష్కరించారు.
సి) అమెరికాకు చెందిన సూపర్సోనిక్ స్టెల్త్ విమానాలు భారత్‌కు రావడం తొలిసారి.
- ఎ, బి, సి, డి
- ఎ, బి, సి, ఇ
- ఎ, బి, డి, ఇ
- పైవన్నీ
40