1. 2022 డిసెంబరు 31 నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని స్టార్టప్ లు ఏర్పాటయ్యాయి? (కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 4,566 స్టార్టప్‌లతో తెలంగాణ 8వ స్థానంలో, 1,341 అంకురాలతో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉన్నాయి. తొలి అయిదు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు: మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్)
- 96,713
- 76,713
- 86,713
- 66,713
3
2. 'ఆధునిక యుద్ధ నౌకల ప్రపంచ డైరెక్టరీ 2022 వెల్లడించిన గణాంకాల ప్రకారం నౌకా బలంలో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? (తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి)
- నాలుగు
- ఆరు
- ఏడు
- అయిదు
7
3. కింది అంశాల్లో సరైంది?
ఎ) 2022 డిసెంబరులో 783 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది.
బి) ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్త చెల్లింపుల్లో 40 శాతం వరకు డిజిటల్ పద్ధతుల్లోనే జరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.
సి) భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ రఘురాం రాజన్ హయాంలో దేశంలో ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) ప్రారంభమైంది.
డి) దేశంలో యూపీఐ లావాదేవీల్లో ఫోనే పే 46 శాతం, గూగుల్ పే 34 శాతంతో ముందున్నాయి. పేటీఎం వాటా 14 శాతం కాగా అన్ని బ్యాంకులు, ఇతరులు ఆరు శాతానికి పరిమితమైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇ) డిజిటల్ చెల్లింపులను విస్తృతపరిచేందుకు బ్యాంకులకు ప్రోత్సాహకంగా కేంద్ర మంత్రివర్గం రూ.2,600 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.
- ఎ, బి, సి
- బి, సి, డి, ఇ
- ఎ, బి, డి, ఇ
- పైవన్నీ
12
4. కింది అంశాల్లో సరైంది?
ఎ) ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2023 అవార్డులను జనవరి 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 11 మంది చిన్నారులకు దిల్లీలో అందజేశారు.
బి) కళ, సంస్కృతి విభాగంలో నలుగురు, శౌర్యం విభాగంలో ఒకర నూతన ఆవిష్కరణ విభాగంలో ఇద్దరు, సామాజిక సేవలో ఒకరు, క్రీడా విభాగంలో ముగ్గురు మొత్తంగా 11 మందికి ఈ పురస్కారాలు అందజేశారు.
సి) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 ఏళ్ల చెస్ క్రీడాకారిణి కోలగట్ల అలనా మీనాక్షి, తెలంగాణకు చెందిన 17 ఏళ్ల నృత్య కళాకారిణి ఎం. గౌరవిరెడ్డి ఈ పురస్కారాలను గెలుచుకున్నారు.
డి) అవార్డు గ్రహీతలకు పతకం, రూ. లక్ష నగదు బహుమతి, ధ్రువపత్రం అందజేశారు.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
16
6. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏటా జనవరి 25న నిర్వహిస్తారు.
బి) ఈ సందర్భంగా జనవరి 25న భారతీయ రైల్వే, కేంద్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 'జగన్నాథ యాత్ర రైలు ప్యాకేజీ'ని ప్రారంభించారు.
సి) ఎనిమిది రోజుల పాటు సాగే ఈ యాత్ర దిల్లీలో ప్రారంభమై వారణాసి, బైద్యనాథ్ ధామ్, పూరీజగన్నాథ్, భువనేశ్వర్, కోణార్క్ తదితర ప్రాంతాలను కలుపుతూ గయలోని 'విష్ణు పాద మందిరం' వద్ద ముగుస్తుంది.
డి) కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 2023ను 'భారత సందర్శన ఏడాది'గా (విజిట్ ఇండియా ఇయర్) ప్రకటించింది.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
24
7. కింది అంశాల్లో సరైంది?
ఎ) భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.
బి) ఈసారి ప్రవేశ పెట్టిన మొత్తం బడ్జెట్ విలువ రూ.45,03,097 కోట్లు.
సి) స్వాతంత్ర్యానంతరం వరుసగా అయిదు బడ్జెట్లను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రుల్లో ఈమె ఆరో వ్యక్తి. ముందుగా అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఉన్నారు.
డి) ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళ నిర్మల.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
28
8. కింది అంశాల్లో సరైంది?
ఎ) భారత్, ఈజిప్ట్ మధ్య రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సంబంధాలను విస్తరించడం సహా సీమాంతర ఉగ్రవాదం నియంత్రణకు పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కుదిరింది.
బి) వచ్చే అయిదేళ్లలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రూ.97,908 కోట్లకు (1200 కోట్ల డాలర్లు) పెంచుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.
సి) 2023 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సీసీ హైదరాబాద్ హౌస్‌లో 2023 జనవరి 253 ప్రధాని మోదీతో సమావేశమై ఒప్పందాలపై సంతకం చేశారు.
డి) హైదరాబాద్ హౌస్ హైదరాబాద్‌లో ఉంది.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
30
9. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కా రానికి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఎంపికైనట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. మూడు ఫార్మాట్ రాణించినందుకుగానూ బాబర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.
బి) ఉత్తమ ఆటగాడికి ఇచ్చే 'సర్ గారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ'ని బాబర్‌కు ప్రదానం చేయనున్నారు.
సి) ఈ పాకిస్థానీ క్రికెటర్ ఐసీసీ 2022 వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి కూడా ఎంపికయ్యాడు.
డి) ఐసీసీ 2022 'టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్క లభించింది.
ఇ) ఐసీసీ 2022 'టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ను వరించింది.
ఎఫ్) ఇంగ్లండ్‌కు చెందిన మహిళా క్రికెటర్ నాట్ సివర్ ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర' అవార్డుతో పాటు 'ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకూ ఎంపికైంది. భారత మహిళల జట్టు పేసర్ రేణుక సింగ్ ఐసీసీ మహిళల 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపికైంది.
- ఎ, బి
- ఎ, బి, సి, డి
- బి, సి, ఇ, ఎఫ్
- పైవన్నీ
36
10. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మిక్స్డ్ డ్ డబుల్స్ ఎవరితో కలిసి ఆడింది? (ఆస్ట్రేలియన్ ఓపెన్ సానియా మీర్జా తన గ్రాండ్లమ్ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించింది. తన చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్ డ్ డబుల్స్‌లో ఈమె రన్నరప్ గా నిలిచింది. ఈమె తన కెరీర్లో మొత్తం 6 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ [మూడు మహిళల డబుల్స్, మూడు మిక్స్డ్ డబుల్స్] గెలుచుకుంది).
- మహేష్ భూపతి, భారత్
- బ్రూనో సోరెస్, బ్రెజిల్
- రోహన్ బోపన్న, భారత్
- సిట్సిపాస్, గ్రీస్
39