1. కింది అంశాల్లో సరైంది ఏది?
ఎ) మనదేశంలో ఏటా జనవరి నెలను గర్భాశయ క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. మహిళ లకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, వ్యాధి బారిన పడ కుండా జాగ్రత్తలు వివరించడం దీని ముఖ్య ఉద్దేశం.
బి) ప్రపంచవ్యాప్తంగా సంభవించే క్యాన్సర్ లలో గర్భాశయ క్యాన్సర్‌ది నాలుగో స్థానం.
సి) హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పీవీ) వల్ల ఈ వ్యాధి వస్తుంది.
- ఎ మాత్రమే
- ఎ, బి
- ఎ, సి
- పైవన్నీ
4
2. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) లబ్దిదారుల సంఖ్య 2023, జనవరి 15 నాటికి దేశ వ్యాప్తంగా 13 కోట్లకుపైగా చేరినట్లు కేంద్రం వెల్లడించింది.
బి) పీఎంజే జేబీవై ద్వారా రూ. 436 వార్షిక ప్రీమియం చెల్లించి, రూ.2 లక్షల జీవిత బీమా బాధ్యత పొందొచ్చు. 18-50 ఏళ్ల వయసు వారు దీనికి అర్హులు.
సి) ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్ బీవై)లో 2023, జనవరి 15 నాటికి దేశవ్యాప్తంగా 29 కోట్లకు పైగా లబ్దిదారులు చేరినట్లు కేంద్రం వెల్లడించింది.
డి) పీఎంఎస్ బీవైలో రూ. 20 వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.2 లక్షల దుర్ఘటన బీమా భద్రత లభి స్తుంది. 18 - 70 ఏళ్ల వయసు వారు ఈ పథకానికి అర్హులు.
ఇ) ఈ రెండు పథకాలు వార్షిక పునరుద్ధర ణకు లోబడి ఉంటాయి.
- ఎ, బి, సి, ఇ
- ఎ, సి, డి, ఇ
- బి, సి, ఇ
- పైవన్నీ
8
3. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, దక్షిణా సియాలో బలహీన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏది? (2023లో ఈ దేశ ఆర్థిక వృద్ధి రేటు గతంలో వేసిన అంచనాల కంటే 2 శాతం నెమ్మదిస్తుందని నివేదిక పేర్కొంది. ఈ దేశంలో గతేడాది సంభవించిన వరదలే ఈ పరిస్థితికి కారణమని నివేదిక విశ్లేషిం చింది. ఈ సంక్షోభం నుంచి బయటపడా లంటే ఆ దేశానికి ఇప్పటికిప్పుడు 3300 కోట్ల డాలర్లు రుణంగా కావాలని ఆర్థిక నిపు ణులు అంచనా వేస్తున్నారు.)
- పాకిస్థాన్
- నేపాల్
- శ్రీలంక
- బంగ్లాదేశ్
9
4. వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్ల్యూపీఆర్) నివేదిక ప్రకారం, 2023 జనవరి 18 నాటికి భారతదేశ జనాభా ఎంత? (భారత్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా అవతరించిందని ఇది పేర్కొంది. 2022, డిసెంబరు 31 నాటికి తమ జనాభా 141.18 కోట్లని చైనా అధి కారికంగా ప్రకటించింది. అదే రోజున భారతదేశ జనాభా 141.7 కోట్లకు చేరి నట్లు డబ్ల్యూపీఆర్ అంచనా వేసింది.)
- 141.9 కోట్లు
- 142.1 కోట్లు
- 142.3 కోట్లు
- 143.3 కోట్లు
15
5. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ డిప్యూటీ ఛీఫ్ అబ్దుల్ రెహ్మన్ మక్కీ (68)ని గ్లోబల్ టెర్ర రిస్ట్ గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఏ దేశం ప్రతిపాదించింది? (ఈ ప్రతిపాద నకు ఆమోదం తెలిపిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2023, జనవరి 16న మక్కీని బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. ఇతడు పాకి స్థాన్ కేంద్రంగా భారత్‌లోకి ఉగ్రమూకలను పంపుతున్నాడు.)
ఎ) భారత్ బి) అమెరికా సి) చైనా డి) ఫ్రాన్స్
- ఎ మాత్రమే
- ఎ, బి
- ఎ, బి, సి
- పైవన్నీ
18
6. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సును భారత్ వర్చువల్‌గా 2023 నిర్వ హించింది. 2023, జనవరి 12, 13 తేదీల్లో ఇది జరిగింది.
బి) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సద స్సును ఉద్దేశించి ప్రసంగించారు. 21వ శతాబ్దంలో ప్రపంచ అభివృద్ధికి దక్షిణాది దేశాలే చోదక శక్తులని మోదీ పేర్కొ న్నారు.
సి) 'యూనిటీ ఆఫ్ వాయిస్, యూనిటీ ఆఫ్ పర్పస్' థీమ్ తో ఈ సమావేశాన్ని నిర్వ హించారు. ఇందులో సుమారు 120 దేశాలకి చెందిన ప్రతినినిధులు పాల్గొ న్నారు.
డి) ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశా లను గ్లోబల్ సౌత్ వ్యవహరిస్తారు.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
24
8. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) భారత పర్యటనలో భాగంగా న్యూజి లాండ్ క్రికెట్ జట్టు 2023, జనవరి 183 భారత జట్టుతో తొలి వన్డే ఆడింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడి యంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌ను భారత్ 12 పరు గుల తేడాతో నెగ్గింది.
బి) 149 బంతుల్లో 208 పరుగులు చేసిన శుభమన్ గిల్ 19 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు నమోదు చేశాడు. పిన్న వయ సులో డబుల్ సెంచరీ సాధించిన ఆట గాడిగా శుభ్ర్మన్ (23 ఏళ్ల 132 రోజులు) రికార్డు సాధించాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉంది.
సి) వన్డేల్లో ద్విశతకం సాధించిన అయిదో భారత బ్యాటర్ గిల్. సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ (3 సార్లు), ఇషాన్ కిషన్ ఈ ఘనత సాధించారు.
డి) మొత్తంగా ప్రపంచ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన వారిలో గిల్ స్థానం ఎనిమిది. క్రిస్ గేల్ (వెస్టిండీస్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), ఫఖార్ జమాన్ (పాకిస్థాన్) కూడా ఈ ఘనత సాధించారు.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
32
9. ఇటీవల వార్తల్లోకి వచ్చిన జోషీమల్కి సంబం ధించి కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) హిమాలయ యాత్రకు వెళ్లే పర్యటకులకు ఇది బేస్ క్యాంప్ ప్రసిద్ధి చెందింది. జోషీ మర్ ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ఉన్న ఒక నగరం.
బి) ఇటీవల జోషీమర్లో వందల సంఖ్యలో భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాంతాన్ని కుంగిపోయే, కొండ చరి యలు విరిగిపడే ప్రాంతంగా అధికారి కంగా గుర్తించారు.
సి) నేల కుంగిపోతూ, ఇళ్లు బీటలు వారు తున్న విపత్కర పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెండు ప్రభుత్వ సంస్థలను ఆదేశించింది. అవి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (డెహ్రాడూన్), జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (హైదరాబాద్) ఇవి సంయుక్తంగా తమ నివేదికను ప్రభుత్వా నికి సమర్పిస్తాయి.
డి) ఎన్టీపీసీ (జాతీయ థర్మల్ పవర్ కార్పొరే షన్) చేపట్టిన తపోవన్ విష్ణుగఢ్ విద్యుత్ పథకం కారణంగా జోషీమర్ ప్రాంతానికి ఈ నష్టం వాటిల్లిందని నిపు ణులు అంచనా వేశారు.
ఇ) 1976లో ఏర్పాటైన మహేష్ చంద్ర కమిటీ జోషీమర్లో విచ్చలవిడి నిర్మా ణాలు చేపట్టకూడదని అప్పట్లో చెప్పింది. ఎఫ్) జోషీమర్ను జ్యోతిర్మర్ అని కూడా పిలుస్తారు. ఆది శంకరాచార్యులు స్థాపించిన బదరీనాథ్ ఆశ్రమం నాలుగు మఠాల్లో ఒకటైన జ్యోతిర్మఠం ఇక్కడ ఉండటమే దీనికి కారణం.
- ఎ, బి
- ఎ, డి
- బి, సి, డి
- పైవన్నీ
36
10. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) కరోనా నియంత్రణకు హైదరాబాద్క చెందిన భారత్ బయోటెక్ సంస్థ 'ఇన్కో వాక్' అనే నాసికా (నాసల్) టీకాను అభివృద్ధి చేసింది. దీన్ని 2023, జనవరి 26న ఢిల్లీలో విడుదల చేశారు.
బి) కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర శాస్త్ర - సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ 'ఇన్కొ వాక్' ను విడుదల చేశారు.
సి) కరోనాకు ఇదే ప్రపంచంలో తొలి నాసికా టీకా. సూది అవసరం లేకుండా ముక్కు ద్వారా తీసుకోవడం దీని ప్రత్యేకత.
- ఎ, బి
- ఎ, బి, డి
- ఎ, సి, డి,
- పైవన్నీ
40