2. కింది అంశాల్లో సరైనవి?
ఎ) సేంద్రియ విత్తనాలు, ఉత్పత్తుల ఎగుమతుల ప్రచారం కోసం జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బి) మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (ఎంఎస్సీఎస్) చట్టం, 2002 ప్రకారం జాతీయ స్థాయిలో సహకార సేంద్రియ సంఘం, సహకార విత్తన సంఘం, సహకార ఎగుమతుల సంఘాలను రిజిస్టర్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
సి) 'సహకార్ సే సమృద్ధి' అనే విజన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన మంత్రి మోదీ వెల్లడించారు.
- ఎ, బి
- ఎ, సి
- బి, సి
- పైవన్నీ
8
3. కింది అంశాల్లో సరైంది?
ఎ) భూగోళంపై ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో కీలకమైన పాత్ర పోషించే ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం క్రమంగా పూడుకుపోతుందని ఐక్యరాజ్య సమితికి చెందిన సైంటిఫిక్ అసెస్మెంట్ ప్యానెల్ తన నివేదికలో వెల్లడించింది.
బి) ఓజోన్ పొర పూడుకుపోవడం 2022లో మొదలైందని నివేదిక పేర్కొంది. ఈ రంధ్రం 2022, సెప్టెంబరు 7 నుంచి అక్టోబరు 13 మధ్య సగటున 23.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి కుంచించుకుపోయినట్లు నివేదిక తెలుపుతుంది.
సి) క్లోరోఫ్లోరో కర్బన ఉద్గారాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో రంధ్రం పూడుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. ఇ విధంగా ఉద్గారాలు తగ్గిపోతే 2066 నాటికి పూర్తిగా ఓజోన్ రంధ్రం పూడుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
డి) ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడినట్లు తొలిసారిగా 1980లో గుర్తించారు. రాబోయే నాలుగు దశాబ్దాల్లో ఈ పొర పూర్వ స్థితికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, సి
- పైవన్నీ
12
4. కింది అంశాల్లో సరైంది?
ఎ) భారత్ 2023-24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ కుదించింది. 6.9 శాతంగా ఉన్న క్రితం అంచనాలను 6.6 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా ఎకనమిక్ అప్డేట్ తెలిపింది.
బి) భారత్ 2021-225 8.7 వృద్ధిరేటును నమోదు చేసుకోగా, ప్రస్తుత 2022-23లో ఈ రేటు 6.9 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే పేర్కొంది.
సి) 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటును ప్రపంచ బ్యాంక్ 6.1 శాతంగా అంచనా వేసింది.
డి) వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీ దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉంటుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.
- ఎ
- ఎ, బి
- ఎ, డి
- పైవన్నీ
16
5. కింది అంశాల్లో సరైంది?
ఎ) రూపే డెబిట్ కార్డు, చిన్న మొత్తాల్లో చేసే యూపీఐ (వ్యక్తి నుంచి భీమ్ చెల్లింపులను వ్యాపారులకు) ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న పథకానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,600 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
బి) కోల్‌కతాలోని 'జాతీయ తాగునీరు, పారిశుద్ధ్యం, నాణ్యత కేంద్రం' పేరును 'డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ జల, పారిశుద్ధ్య సంస్థ’గా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- రెండూ సరైనవే
- రెండూ సరికాదు
19
7. కింది వాటిలో సరైనవి?
ఎ) రష్యా దండయాత్రతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా 375 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని ప్రకటించింది.
బి) ఈ సాయంతో కలిపి ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్‌కు చేసిన సాయం విలువ 2000 కోట్ల డాలర్లకు పైగా చేరుకుంది.
సి) ఈ స్థాయిలో అమెరికా ఇప్పటివరకు ఏ దేశానికి సాయం అందించలేదు.
డి) ఉక్రెయిన్‌కు తొలిసారిగా ఎం2 ఏ2 బ్రాడ్లీ సాయుధ వాహనాలు 50 అందించాలని అమెరికా నిర్ణయించింది.
- ఎ, బి
- ఎ, డి
- ఎ, సి
- పైవన్నీ
28
8. కింది అంశాల్లో సరైనవి?
ఎ) దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన బ్లాక్ అభివృద్ధి కోసం ఉద్దేశించిన అభిలషణీయ బ్లాక్ పథకాన్ని (ABP-Aspirational Block Programme) 2023, జనవరి 7న దిల్లీలో ప్రారంభించారు.
బి) 2018లో ప్రారంభించిన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పథకం మాదిరిగానే ఏబీపీ కార్యక్రమంలోనూ భారత్ అభివృద్ధికి నాలుగు స్తంభాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక రంగం), ఇన్వెస్ట్మెంట్ (పెట్టుబడి), ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ (ఆవిష్కరణ), (సమ్మిళితం)లపై దృష్టి సారించాలని మోదీ పిలుపునిచ్చారు.
సి) 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ఏబీపీని ప్రకటించింది.
డి) ఏబీపీలో భాగంగా 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 500 జిల్లాలను అభివృద్ధి చేస్తారు. ఉత్తర్ ప్రదేశ్ (68 బ్లాక్స్), బిహార్ (61), మధ్యప్రదేశ్ (42), ఝార్ఖండ్ (34), ఒడిశా (29), పశ్చిమంగా (29)ల్లోని అత్యధిక బ్లాక్స్న అభివృద్ధి చేశారు.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
32
9. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల సైప్రస్, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించారు.
బి) భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమిలో సైప్రస్ 92వ సభ్య దేశంగా చేరింది. రెండు దేశాల మధ్య విద్యార్థులు, వృత్తి నిపుణులు, వ్యాపా రులు సులభంగా ప్రయాణించేందుకు అవసరమైన అవగాహన పత్రంపై సంత కాలు జరిగాయి. ఉభయ దేశాల మధ్య సైనిక సహకారానికి ఒప్పందం కుది రింది.
సి) 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాను సందర్శిం చిన తొలి భారత విదేశాంగ మంత్రిగా జైశంకర్ వార్తల్లో నిలిచారు.
డి) ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా పనిచేసే 'వాసెనార్ అరేంజ్ మెంట్' ప్లీనరీ ఛైర్మన్ గా భారత్ 2023, జనవరి 1న బాధ్యతలు చేపట్టింది.
- ఎ, బి
- ఎ, డి
- బి, సి, డి
- పైవన్నీ
36
10. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ప్రతిష్ఠాత్మక 'హింద్ కేసరి' జాతీయ ఇండియన్ స్టయిల్ సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో అభిజిత్ కాట్కే ఛాంపియ న్గా నిలిచాడు. ఇతడు మహారాష్ట్రకి చెందిన రెజ్లర్.
బి) అభిజిత్ కాట్కేకి మూడు కిలోల వెండి గద బహుమతిగా దక్కింది. ఫైనల్లో అభిజిత్ 5-0 తో హరియాణాకు చెందిన సోమవీర్పై విజయం సాధించాడు.
సి) మహిళా హింద్ కేసరి టైటిల్‌ను హరి యాణాకు చెందిన పుష్ప సొంతం చేసు కుంది. ఈ ఫైనల్లో మోహిని (దిల్లీ)పై నెగ్గింది.
డి) ఈ పోటీలను హైదరాబాద్ లో నిర్వహిం చారు.
- ఎ, బి
- ఎ, బి, డి
- ఎ, సి, డి,
- పైవన్నీ
40