1. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేం దుకు కేంద్రం గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రోత్సహిస్తోంది. దీనికోసం 2023 కాలా నికి రూ. 19,744 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
బి) నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 2030 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టు బడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
సి) వచ్చే అయిదేళ్లలో ఏడాదికి 50 లక్షల టన్నుల చొప్పున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
- ఎ, డి
- ఎ, బి
- ఎ, సి
- పైవన్నీ
4
2. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్. ఇందులోని ఆర్మీ టీమ్ లీడర్‌గా ఎంపికైన
హెడ్ క్వార్టర్స్ తొలి మహిళ ఎవరు? (ఆర్మి ఇంతవరకు 9000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ వరకే మహిళా ఆఫీసర్లను నియమించింది. కానీ 15000 అడుగుల నుంచి 20 వేల అడుగుల (బాణాసింగ్ బంకర్) ఎత్తు వరకు సియాచిన్ లో వివిధ స్థానాల్లో ఉండే స్థావరాలకు మహిళా ఆఫీస ర్లను పంపలేదు. ఆర్మీ మొదటిసారిగా ఈమెకు సియాచిన్ హెడాక్వార్టర్స్ పోస్టింగ్ ఇచ్చింది. )
- కెప్టెన్ ప్రీతి మస్కే
- కెప్టెన్ కైనజ్ కర్మాకర్
- కెప్టెన్ శివ చౌహాన్
- కెప్టెన్ సుగుణ నిధి
7
3. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) 2023, జనవరి 5న మధ్యప్రదేశ్ రాజ ధాని భోపాల్‌లో రాష్ట్రాల జలవనరులశాఖ మంత్రుల తొలి జాతీయ సదస్సును నిర్వహించారు.
బి) ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు. రాబోయే 25 ఏళ్లలో సాగించబోయే 'అమృతకాల' ప్రయాణంలో 'వాటర్ విజన్ 2047' అనేది అత్యంత కీలకమని మోదీ పేర్కొన్నారు.
సి) ఆజాదీకా అమృత్ మహోత్సవ్ భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలు (చెరువులు) నిర్మిం చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుందని మోదీ వెల్లడించారు. ఇప్పటికీ 25 వేల సరోవరాలు నిర్మించినట్లు చెప్పారు. ప్రతి సరోవరం కనీసం ఎకరం వైశాల్యంలో ఉంటుందని, ఇందులో 10,000 క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వచే యొచ్చని పేర్కొన్నారు.
డి) 'పైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ ఇరిగేషన్ స్కీం' కింద 70 లక్షల హెక్టార్లకు పైగా భూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తెస్తు న్నట్లు మోదీ ప్రకటించారు.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
12
5. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) జపాన్ రాజధాని టోక్యోను వీడి, దేశం లోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడే యువ జంటలకు ఒక్కో బిడ్డకు పదిలక్షల యెన్ల (సుమారు రూ. 6 లక్షలు) చొప్పున నజ రానా అందిస్తామని జపాన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
బి) కొత్త ప్రాంతాలకు వెళ్లేవారు అక్కడ కనీసం అయిదేళ్లు నివాసం ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది.
సి) 2022 గణాంకాల ప్రకారం, జనాభా సుమారు 12.39 కోట్లు. ఇందులో ఒక్క టోక్యోలోనే సుమారు 30 శాతం (3.70 కోట్లు) నివసిస్తున్నారు. అక్కడి గ్రామీణ యువత పెద్ద సంఖ్యలో ఉపాధి కోసం టోక్యో, సైతామా, చిబా, కనగావా నగరాలకు వలస వెళ్తున్నారు. దీంతో ఆ నగరాలపై ఒత్తిడి పెరుగుతోంది. జనం తరలిపోతుండటంతో గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నాయి.
డి) జపాన్‌లో 'డిజిటల్ గార్డెన్ సిటీ నేషన్'ను 2023 నుంచి అయిదేళ్ల పాటు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో శాటిలైట్ కార్యాల యాలను తెరుస్తారు. ఆధునిక మౌలిక వసతులను సమకూరుస్తారు. టోక్యో లాంటి నగరాల నుంచి యువత తమ సొంత ప్రాంతాలకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది.
- ఎ, బి
- ఎ, సి, డి
- ఎ, సి
- పైవన్నీ
20
6.రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఆర్డీఓఎల్ 2022 (ప్రపంచ చట్టబద్ద పాలనా సూచీలో భారత్ ఎన్నో స్థానంలో నిలి చింది? (మొత్తం 140 దేశాలు ఈ సూచీలో ఉన్నాయి. అమెరికాకు చెందిన వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ డబ్ల్యూజేపీ ఈ సూచీని రూపొందించింది. ప్రభుత్వాధికారా లకు పరిమితులు, ప్రాథమిక హక్కులు, న్యాయం అందరికీ అందుబాటులో ఉండటం, అవినీతి లేకపోవడం లాంటి ఎనిమిది ప్రధానాంశాల ప్రాతిపదికన దీన్ని తయారు చేశారు. )
- 57
- 67
- 77
- 87
23
9. కింది వాటిని జతపరచండి.
a. గయానా i) మహ్మద్ ఇర్ఫాన్ అలీ (అధ్యక్షుడు)
b. మారిషస్ ii) పృథ్వీరాజ్ (అధ్యక్షుడు) రూపన్
C. బ్రిటన్ iii) ఆంటోనియా కోస్తా (ప్రధాని)
d. పోర్చుగల్ iv) రిషి సునాక్ (ప్రధాని)
- a-i, b-ii, c-iili, d-iv
- a-i, b-ii, c-iv, d-iii
- a-ii, b-i, c-iv, d-iii
- a-iv, b-i, c-iii, d-ii
34
10. కింది అంశాల్లో సరైనవి?
ఎ) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తొలి ముందస్తు అంచనాలు వెల్లడించాయి.
బి) 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (8.7 శాతం) ఇది 1.7 శాతం తక్కువగా ఉంది.
సి) తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు వృద్ధిరేటు అంచనా భారీ తగ్గుదలకు కారణమని పేర్కొంది.
డి) స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్-జీవీఏ) ప్రాతిపదికన 2022-23 వృద్ధిరేటు 8.1 శాతం శాతం నుంచి 6.7 శాతానికి తగ్గనుంది.
ఇ) ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రాంతం, పరిశ్రమ లేదా రంగంలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల విలువే జీవీఏ. జీడీపీలో ఒక నిర్దిష్ట రంగం ఉత్పత్తి తోడ్పాటును జీవీఏ ప్రతిబింబిస్తుంది. అన్ని రంగాల జీవీఏలను కలిపి, పన్నులు- సబ్సిడీలకు సంబంధించి అవసరమైన సర్దుబాటు చేస్తే ఆర్థిక వ్యవస్థ జీడీపీ విలువ వస్తుంది.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి, ఇ
- పైవన్నీ
40