1. శాస్త్రీయ, పర్యావరణ కేంద్రం (సీఎస్ఈ) రూపొందించిన భారత వాతావరణ స్థితిగతుల నివేదిక 2022 ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఎంత భూమి శాతం క్షీణతకు గురైంది? (భారత్‌లోని మొత్తం భౌగోళిక ప్రాంతంలో 30 శాతం నేల దెబ్బతింది. దేశంలో వ్యవసాయ భూమి 46 శాతం, అటవీ భూమి 22 శాతం మేర సారం కోల్పోయినట్లు సీఎస్ఈ అంచనా వేసింది)
- 42 శాతం
- 52 శాతం
- 62 శాతం
- 72 శాతం
3
2. మాజీ మిలటరీ కమాండర్ సిటివెని రబుకా ఏ దేశ 2022 డిసెంబరులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు? (ఈ దేశ ప్రధానిగా సుమారు 16 ఏళ్లు కొనసాగిన ఫ్రాంక్ బైనిమరామ స్థానంలో ఈయన నూతన ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు)
- మాల్దీవులు
- ఫిజీ
- ఘనా
- ఆస్ట్రియా
6
3. కేంద్ర ప్రభుత్వ భారత్‌లో గణాంకాల ప్రకారం గుర్తింపు పొందిన అంకురాల (స్టార్టప్‌లు) సంఖ్య 2022, నవంబరు 30 నాటికి ఎంతకు చేరింది? ( 2016లో భారత్ లో గుర్తింపు పొందిన అంకురాల సంఖ్య కేవలం 452. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ వివరాలను ఇటీవల పార్లమెంటులో వెల్లడించారు. దేశంలో అంకుర వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు 2016, జనవరి 16న 'స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు)
- 74012
- 64012
- 84012
- 94012
11
4. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? (వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం 1986లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో వినియోగదారుల వేదికలు ఏర్పాటయ్యాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా 2019లో పాతచట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు)
- డిసెంబరు 21
- డిసెంబరు 22
- డిసెంబరు 23
- డిసెంబరు 24
16
7. రంజీ ట్రోఫీ మ్యాచ్ మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? (రాజ్‌కోట్‌లో దిల్లీతో జరిగిన రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర బౌలర్ ఈ ఘనత సాధించాడు. 88 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారిగా ఈ రికార్డు నమోదైంది.)
- హర్విక్ దేశాయ్
- జైదేవ్ ఉనద్కత్
- లలిత్ యాదవ్
- శివమ్ మావి
26
9. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేమన జయంతి (జనవరి 19ని రాష్ట్ర పండుగగా నిర్వ హించాలని నిర్ణయించింది.
బి) దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2022, డిసెంబరు 30న జీఓ 164ను విడుదల చేసింది.
సి) కర్ణాటక ప్రజల ఆకాంక్ష మేరకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2017, డిసెంబరు 22న వేమన జయంతిని అధికారికంగా రాష్ట్రంలో నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
డి) వేమన సమాధి ఆంధ్రప్రదేశ్‌లోని సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని కటారుపల్లి గ్రామంలో ఉంది.
- ఎ, బి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
36
10. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారత్‌లో తమ దేశ రాయబారిగా ఎవరిని పునర్నియ మించారు? (ఈయన లాస్ఏంజెల్స్ మాజీ మేయర్. డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ మేనేజ్మెంట్ రిసోర్సెస్ పదవికి ఇండియన్ అమెరికన్ రిచర్డ్ వర్మను, వరల్డ్ హెల్త్ ఆర్గ నైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రతినిధిగా మరో ఇండియన్ అమెరికన్ డాక్టర్ వివేక్ హాలెగెరె మూర్తిని అధ్యక్షుడు బైడెన్ రీ నామినేట్ చేశారు. )
- ఎరిక్ గార్సెట్టీ
- కెవిస్ మెకార్తీ
- చెక్ గ్రాసిటీ
- బాబుడ్
37