1. 1. కింది అంశాల్లో సరైంది?
ఎ) 2021లో దేశవ్యాప్తంగా 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు కేంద్ర రోడ్డు రవాణా హైవే శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది గాయపడ్డారు.
బి) 2021లో దేశంలో జరిగిన ప్రమాదాల్లో సీటు రోడ్డు పెట్టుకోకపోవడంతో 16,397 మంది చనిపోయారు. వీరిలో 8,438 మంది సంబంధిత వాహనాల డ్రైవర్లు కాగా 7,959 మంది ప్రయాణికులున్నారు.
సి) 2021లో రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 46,593 మంది మృతి చెందారు. వీరిలో 32,877 మంది వాహనచోదకులుకాగా మిగతా 13,716 మంది ప్రయాణికులు.
డి) మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 8.2 శాతం డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, జంపింగ్ రోడ్ లైట్, సెల్‌ఫోన్ వాడకం లాంటి కారణాలతోనే జరిగినట్లు కేంద్రం వెల్లడించింది.
- ఎ మాత్రమే
- ఎ, బి
- ఎ, బి, సి
- పైవన్నీ
4
2. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని జాతీయ రహదారి పై విమానాల అత్యవసర ల్యాండింగ్ తొలి ట్రయల్న్ విజయవంతంగా నిర్వహించారు.
బి) పిచ్చకలగుడిపాడు-రేణింగవరం గ్రామాల మధ్య 16వ నంబరు హైవేపై 4.1 కి.మీ.ల పొడవు, 33 మీ. వెడల్పుతో ఏర్పాటు చేసిన ఈ రన్ వే మీదుగా నాలుగు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, ఒక కార్గో విమానం అయిదు అడుగుల ఎత్తులో తిరిగాయి.
సి) కొరిశపాడులోని ఈ రనే దక్షిణ భారత్‌లో మొదటిది. దేశంలో మూడోది.
డి) ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో ఇప్పటికే రెండు అత్యవసర ల్యాండింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
- ఎ, బి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
8
3. పదవులు తొలి మహిళలకు సంబంధించి సరైన జతను గుర్తించండి.
a) ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) తొలి మహిశా అధ్యక్షురాలు i) మాధబీ పూరీ బుచ్
b) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తొలి మహిళా సీఎండీ ii) నల్లతంబి కలై సెల్వి
C) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ iii) పీటీ ఉష ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్
d) సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తొలి మహిళా చైర్పర్సన్ iv) డాక్టర్ ఆల్కా మిత్తల్
- a-i, b-ii, c-iii, d-iv
- a-iii, b-iv, c-ii, d-i
- a-iii, b-ii, c-iv, d-i
- c-i,a-ii, b-iii,d-iv
10
4. కింది అంశాల్లో సరైంది?
ఎ) ఈ-స్పోర్ట్స్‌ను (ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్) భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇకపై బహుళ క్రీడల ఈవెంట్లలో ఈ-స్పోర్ట్స్‌ను కూడా చేర్చనున్నారు.
బి) 2018 జకార్తా ఆసియా క్రీడల్లో ఈ-స్పోర్ట్స్్న ప్రదర్శన క్రీడగా చేర్చారు. కానీ పతకాలను లెక్కలోకి తీసుకోలేదు.
సి) 2023 జూన్ మొదటి ఈ-స్పోర్ట్స్ వీకన్ను వీక్ ను సింగపూర్ లో నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) నిర్ణయించింది.
- ఎ, బి
- ఎ, సి
- బి, సి
- పైవన్నీ
16
5. కింది అంశాల్లో సరైంది?
ఎ) జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 50 కేజీల విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ స్వర్ణం నెగ్గింది. ఫైనల్లో 4-1తో అనామికపై గెలిచింది.
బి) టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గో హైన్ 75 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గింది.
సి) 48 కేజీల విభాగంలో మంజురాణి, 54 కేజీల విభాగంలో శిక్ష, 60 కేజీల విభాగంలో పూనమ్, 63 విభాగంలో శశి చోప్రా, ప్లస్ 81 కేజీల విభాగంలో నుపుర్ స్వర్ణ పతకాలు నెగ్గారు.
- ఎ, బి
- బి, సి
- ఎ, సి
- పైవన్నీ
20
6. మొట్టమొదటి వీర్ బాల్ దివస్ ను ఏ రోజున నిర్వహించారు? (దిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. తమ మతాన్ని రక్షించుకోవడానికి ప్రాణాలు విడిచిన సిక్కు మతగురువు గురు గోబింద్ సింగ్ తనయులు జూరావర్ సింగ్, ఫతేసింగ్లకు ఈ సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు).
- 2022, డిసెంబరు 26
- 2022, డిసెంబరు 27
- 2022, డిసెంబరు 28
- 2022, డిసెంబరు 29
21
7. నేపాల్ నూతన ప్రధానమంత్రిగా 2022, డిసెంబరు 26న సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ (ఎంసీ) పార్టీ ఛైర్మన్ పుష్పకమల్ దహాల్ ప్రచండ ప్రమాణస్వీకారం చేశారు. అయితే దీనితో ఈయన ఎన్నవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినట్లు అవుతుంది? (దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ఈయనతో ప్రమాణం చేయించారు. నూతన మంత్రివర్గంలో ముగ్గురు ఉప ప్రధానులు బిష్ణు పౌడల్, నారాయణ్ కాజీ శ్రేష్ఠ, రబి లామి చాను ఉన్నారు)
- మూడు
- రెండు
- నాలుగు
- అయిదు
25
8. దివంగత ప్రధానమంత్రి అటల్ వాజ్ పేయి 2022, జయంతి సందర్భంగా డిసెంబరు 25న పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ప్రసంగించిన తెలంగాణ విద్యార్థిని ఎవరు? (దివంగత ప్రధాని వాజ్‌పేయి జీవితంపై యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ప్రసంగించడానికి దేశ వ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా వారిలో ఏడుగురికి పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రసంగించే అవకాశం దక్కింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఈమెకు అవకాశం లభించింది)
- మంజుల చక్రవర్తి
- పద్మావతి కమలాకర్
- కేతావత్ మౌనిక
- శ్రీనిధి దాస్
31
9. ఏ రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను 2022, డిసెంబరు 27న ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది? (దీనికి 2001 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. డీలిమిటేషన్ చట్టం-1972 ప్రకారం చివరిసారిగా 1976లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిగింది. అప్పుడు 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో 14 లోక్‌సభ, ఏడు రాజ్యసభ, 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి)
- కర్ణాటక
- అసోం
- నాగాలాండ్
- కేరళ
34