1. కింది అంశాల్లో సరైంది?
ఎ) జాతీయ గణిత దినోత్సవాన్ని ఏటా డిసెంబరు 22న నిర్వహిస్తారు.
బి) గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా దీన్నినిర్వహిస్తారు.
సి) ఈ ఏడాది నార్వేలో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో చైనా, రష్యా, అమెరికా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
డి) మొత్తం 104 దేశాలు ఈ పోటీలో పాల్గొనగా భారత్ 24వ స్థానంలో నిలిచింది.
- ఎ మాత్రమే
- ఎ, బి
- ఎ, బి, సి
- పైవన్నీ
4
3. కింది అంశాల్లో సరైంది?
ఎ) భారతీయ వైద్య సమాజానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి-2022 అవార్డును ప్రకటించారు.
బి) కరోనా సమయంలో అవిశ్రాంతంగా సేవలు అందించినందుకు భారతీయ వైద్యులకు ఈ పురస్కారం దక్కింది.
సి) దేశంలోని వైద్యులు, నర్సులు అందరి ఇండియన్ మెడికల్ తరపున అసోసియేషన్ (ఐఎంఏ), ట్రైయిన్డ్ నర్సెస్ ఆర్గనైజే షన్లకు (టీఎన్ఏ) ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రకటించింది.
డి) పురస్కార ఎంపిక కమిటీకి విశ్రాంత సీజేఐ జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వం వహించారు. అవార్డు కింద రూ. కోటితో పాటు ట్రోఫీ, ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు.
- ఎ మాత్రమే
- ఎ, బి
- ఎ, బి, డి
- పైవన్నీ
12
5. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2022, డిసెంబరు 18న ప్రధాని మోదీ మేఘాలయ, త్రిపురల్లో పర్యటించారు. సుమారు రూ. 6,800 కోట్ల విలువైన ప్రారంభోత్సవాలు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.
బి) మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ కౌన్సిల్ (ఎన్ఎస్ఈసీ) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. గత 50 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఎన్ఈసీ పోషించిన పాత్రను వివరిస్తూ రచించిన 'గోల్డెన్ ఫుట్ ప్రింట్స్' అనే పుస్తకాన్ని విడుదల చేశారు.
సి) ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం 1971లో పార్లమెంట్ చట్టం ద్వారా నార్త్ ఈస్ట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. 1972, నవంబరు 7 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
డి) త్రిపుర రాజధాని అగర్తలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 2 లక్షలకు పైగా నూతన గృహాలను ప్రధాని ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు.
- ఎ, బి మాత్రమే
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
20
6. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ) దేశీయంగా తయారు చేసిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ 'ఐఎన్ఎస్ మారుగావ్'ను 2022, డిసెంబరు 18 న రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సాంగ్ ముంబయిలో నౌకాదళంలోకి ప్రవేశ పెట్టారు.
బి) గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, నౌకాదళాధిపతి అడ్మిరల్ హరికుమార్ పాల్గొన్నారు.
సి) ఈ యుద్ధనౌక పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు, బరువు 7,400 టన్నులు. గరిష్ఠ వేగం గంటకు 55 కిలోమీటర్లు. గోవాలోని చారిత్రక ఓడరేవు నగరమైన మార్ముగావ్ పేరిట దీనికి ఈ పేరు పెట్టారు.
డి) 'ప్రాజెక్టు 15 బీ' లో నిర్మిస్తున్న నాలుగు విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్లో ఇది రెండోది. భారత నావికాదళంలో భాగమైన వార్‌షిప్ డిజైన్ బ్యూరో ఈ నౌకను డిజైన్ చేసింది. ముంబయిలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది.
- ఎ మాత్రమే
- ఎ, బి
- ఎ, సి
- పైవన్నీ
24
8. కింది అంశాల్లో సరైంది?
ఎ) వడగాడ్పుల తాకిడితో భారత్ 2030 నాటికి తన జీడీపీలో 4.5 శాతం మేర నష్టపోవాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది.
బి) వీటి వల్ల ఉత్పాదకత తగ్గి 2030 నాటికి దాదాపు 8 కోట్ల మంది ఉపాధి కోల్పోతారని నివేదికలో పేర్కొన్నారు.
సి) 2030 నాటికి దేశీయంగా దాదాపు 20 కోట్ల మంది తీవ్రఉష్ణగాలుల ప్రభావానికి గురవుతారని వెల్లడించింది.
- ఎ, బి
- ఎ, సి
- ఎ మాత్రమే
- పైవన్నీ
32
9. భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ఏ దేశ ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు? (ఫిన్గా గేల్ (ఫిన్గాల్ పార్టీకి పార్టీకి చెందిన ఈయనకు రొటేషన్ పద్ధతిలో ఈ అవకాశం లభించింది. ఈయన 2017లో మొదటిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు)
- న్యూజిలాండ్
- కెనడా
- ఐర్లాండ్
- బెల్జియం
35