1. ఏ రాష్ట్రం ప్రస్తుతం అక్కడి ప్రజలకు అందించే రిజర్వేషన్లను 60 నుంచి 77 శాతా నికి పెంచింది? (2022, నవంబరు 11న ఆ రాష్ట్ర శాసనసభ ఈ బిల్లును ఆమోదించింది. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వే షన్ల కల్పనకు ఉద్దేశించిన 2001 నాటి బిల్లుకు ఈ మేరకు సవరణలు చేశారు. తాజా బిల్లుతో రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు - ఓబీసీ, ఆర్థి కంగా బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 77 శాతా నికి పెరుగుతాయి.)
- బిహార్
- మధ్యప్రదేశ్
- ఝార్ఖండ్
- గుజరాత్
3
3. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ప్రపంచవ్యాప్తంగా 2012తో పోలిస్తే 2050 నాటికి ఆహార డిమాండ్ 50 శాతం అధికమవుతుందని ఐక్యరాజ్యస మితి తాజా నివేదిక వెల్లడించింది.
బి) ఈ క్రమంలో పంటల ఉత్పత్తికి, పశుపో షణకు 60 కోట్ల హెక్టార్ల వరకు సాగు భూమి అదనంగా అవసరం అవుతుందని ఐరాస అంచనా వేసింది.
సి) ప్రపంచవ్యాప్తంగా 2000-18 మధ్య జరి గిన అటవీ నిర్మూలనలో 90 శాతం వ్యవసాయ విస్తరణ కోసమే జరిగిందని; ఇది జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోందని; వ్యవ సాయం, అడవుల సంరక్షణను సమ న్వయం చేసుకుంటూ స్థిరమైన ఆహార వ్యవస్థలను నిర్మించుకోవాలని ఐరాస తన నివేదిక పేర్కొంది.
- ఎ మాత్రమే
- ఎ, బి
- ఎ, సి
- పైవన్నీ
12
5. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 17వ జీ-20 సదస్సును 2022, నవం బరు 15-16 తేదీల్లో ఇండోనేసియాలోని బాలిలో నిర్వహించారు.
బి) నవంబరు 15న జీ-20 శిఖరాగ్ర సద స్సులో ప్రధాని మోదీ సభ్యదేశాల అధినే తలను ఉద్దేశించి ప్రసంగించారు. వాతా వరణ మార్పులు, కొవిడ్-19 మహ మ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఆహార-ఇంధన భద్రత తదితర అంశా లపై మోదీ మాట్లాడారు.
సి) 2022 జీ-20 థీమ్: 'రికవర్ టు గెదర్, రికవర్ స్ట్రాంగర్'. 2023లో ఈ సద స్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
డి) జీ-20ని 1999లో ఏర్పాటు చేశారు. ఇందులోని సభ్య దేశాలు: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్.
- ఎ, బి మాత్రమే
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
20
6. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) ఏటా నవంబరు 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
బి) ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారుగా ఉంది. ఈ రంగ సమగ్రాభివృద్ధి, మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం 2020, సెప్టెంబరు 10న ప్రధా నమంత్రి మత్స్య సంపద యోజన (పీఎం ఎంఎస్ వై) పథకాన్ని ప్రారంభించింది.
సి) 2021-22లో భారత్ రూ. 57,587 కోట్ల విలువైన మత్స్య ఎగుమతులు చేసింది. అందులో ఎక్కువ భాగం రొయ్యలే. డి) ప్రపంచవ్యాప్తంగా మత్స్య జాతులు ఆవా సాల్లో మూడింట రెండొంతుల ప్రాంతాల్లో విచ్చలవిడి వేట కొనసాగడం లేదా వ్యవ సాయానికి అనుగుణంగా మారిపోవడమో జరుగుతోందని ఐరాస తాజా నివేదిక వెల్లడించింది.
- ఎ మాత్రమే
- ఎ, బి
- ఎ, సి
- పైవన్నీ
24
7. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రో త్సవ (ఇఫీ) వేడుకలను 2022, నవం బరు 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు గోవాలో నిర్వహిస్తున్నారు.
బి) ఇఫీ (IFFI) అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.
సి) 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022' పురస్కారాన్ని మెగా స్టార్ చిరంజీవి అందుకున్నారు. గతంలో ఈ అవార్డుని అమితాబ్ బచ్చన్, హేమా మాలిని, రజనీకాంత్, ఇళయరాజా తదిత రులు పొందారు.
డి) కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, డి
- పైవన్నీ
28
8. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలు 2022, నవంబరు 20న ఖతార్ రాజధాని దోహా లోని అల్బైత్ స్టేడియంలో ప్రారంభమ య్యాయి. ఖతార్ రాజు తమిమ్ బిన్ హమద్ అల్ ధని ఈ పోటీలు ప్రారంభిం చారు.
బి) టోర్నీలో తొలి మ్యాచ్ ఆతిథ్య ఖతార్ - ఈక్వెడార్ల మధ్య జరిగింది. ఈక్వెడార్ 2-0 గోల్స్ తేడాతో విజయం సాధిం చింది. 92 సంవత్సరాల ప్రపంచకప్ చరి త్రలో ఆరంభ మ్యాచ్లో ఓడిన తొలి ఆతిథ్య జట్టు ఖతార్.
సి) టోర్నీలో పాల్గొంటున్న దేశాల సంఖ్య 32. ఈ ప్రపంచకప్ అధికారిక మస్కట్ 'లాయిబ్'.
డి) పుట్బాల్ ప్రపంచకప్ - 2022 బ్రాండ్ అంబాసిడర్ ఘనిమ్ అల్ ముఫ్తా. ఇతడు యూట్యూబర్. ఘనిమ్ 'కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్'తో బాధపడుతున్నారు. ఇతడి నడుము కింది భాగం మొత్తం చచ్చుబడి పోయింది.
- ఎ, బి
- ఎ, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
32
9. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) హెన్లీ గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్ - 2022 అంచనా ప్రకారం, 2022లో 88 వేల మంది హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (10 లక్షల డాలర్ల సంపద కలిగిన వ్యక్తులు) తమ మాతృదేశాన్ని వదిలి మరో దేశానికి వలస వెళ్లనున్నారు.
బి) వలస వెళ్తున్న పెట్టుబడిదారుల తొలి చిరునామాగా యూఏఈ నిలిచింది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఈ రెండు దేశాలకు వరుసగా 4000, 3500 మంది వలస వెళ్తారని నివేదిక అంచనా వేసింది.
సి) రష్యా నుంచి అత్యధికంగా 15,000 మంది వలస వెళ్తారని నివేదిక అంచనా వేసింది. తర్వాతి స్థానాల్లో చైనా (10,000 మంది), భారత్ (8,000 మంది) ఉన్నాయి.
డి) గత రెండు దశాబ్దాల్లో వివిధ దేశాల నుంచి 80 వేల మంది కోటీశ్వరులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారని నివేదిక
- ఎ, వెల్లడించింది
- ఎ, బి, డి
- ఎ, బి
- పైవన్నీ
36
10. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? (ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, మరో కమిషనర్ అనూప్ చంద్రపాండే మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.)
- కీర్తన్ పాండే
- మోహిత్ నెహ్రా
- అరుణ్ గోయల్
- కిషోర్ సింఘాల్
39