1. మహిళా హక్కుల ఉద్యమకారిణి, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ విమెన్స్ అసోసియేషన్ (సేవా) వ్యవస్థాపకురాలు ఇలాభట్ (89) 2022, నవంబరు 2న ఏ నగరంలో మరణించారు? (ఈమె పద్మభూషణ్ అవార్డు గ్రహీత. వస్త్ర రంగంలో పనిచేసే మహిళల కోసం 1972లో 'సేవా'ను నెలకొ ల్పారు. తర్వాతికాలంలో ఇది ఇతర రంగా లకూ విస్తరించింది. ఈమె రాజ్యసభ సభ్యు రాలిగా, ప్రణాళికా సంఘం సభ్యురాలిగా పనిచేశారు. ఇలాభట్‌కు రామన్ మెగసెసే, రైట్ లైవ్లీహుడ్, నివానో శాంతి బహుమతి, ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి బహు మతి లభించాయి.)
- అహ్మదాబాద్
- లఖ్ నవూ
- కలకత్తా
- దిల్లీ
1
2. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2020-21 విద్యా సంవత్సరంలో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు విద్యా రంగంలో కనబరచిన పనితీరుకు సంబంధించి 'పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్'ను కేంద్ర విద్యాశాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం విడుదల చేసింది.
బి) ఇందులో లెవల్-2లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్, చండీగఢ్, మహారాష్ట్ర, గుజ రాత్, రాజస్థాన్‌లు ఉన్నాయి.
సి) 2020-21 విద్యా సంవత్సరంలో లెవల్- 1ను దేశంలోని ఏ రాష్ట్రమూ సాధించలేదు.
డి) పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌ని వివిధ అంశాలవారీగా 1000 పాయింట్లకు ప్రామాణికంగా తీసుకుని కేంద్రం ఆయా రాష్ట్రాల లెవల్ స్థాయులను ప్రకటి స్తుంది. ఇందులో 901 నుంచి 950 మధ్య పాయింట్లు సాధించిన రాష్ట్రాలు లెవల్ 2లో లుస్తాయి.
- ఎ, డి
- ఎ, బి
- ఎ, బి, సి
- పైవన్నీ
8
3. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) 2022, అక్టోబరు 31 నుంచి నవంబరు 6 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్స వాలను నిర్వహించింది.
బి) 2022, నవంబరు 3న దిల్లీలో నిర్వహిం చిన ఈ వారోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
సి) సీవీసీ ఆధ్వర్యంలో నూతన 'కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టం' పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు.
డి) 'ఎథిక్స్, గుడ్ ప్రాక్టీసెస్, కంపైలేషన్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆన్ ప్రివెంటివ్ విజిలెన్స్' అనే అంశంపై పుస్తకాలను మోదీ విడు దల చేశారు.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి
- పైవన్నీ
12
4. జీ20 కూటమికి సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) జీ20 కూటమిలోని దేశాల మధ్య పరస్పర అనుసంధానత, బాధ్యతల భాగస్వామ్యం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 'ఎకానమీ విజన్' అనే సరికొత్త విధానాన్ని ప్రతిపాదించారు.
బి) క్యోటో ప్రోటోకాల్ (1997), పారిస్ కాప్-21 (2015) అంతకుముందు రియో (1992), కో పెన్ హెగెన్ సదస్సు (2009)ల్లో చేసిన తీర్మానాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంతో పర్యావరణ పరిరక్షణ, భూతాప నియంత్రణలో 63 దేశాల పనితీరుపై నివేదిక వెలువడింది. ఇందులో భారత్‌కు 8వ స్థానం లభించగా, చైనా 51, అమెరికా 52వ స్థానాల్లో నిలిచాయి.
సి) జీ20 కూటమిని 1999లో ఏర్పాటు చేశారు.
డి) జీ20 కూటమి తొలి శిఖరాగ్ర సదస్సును వాషింగ్టన్ 2008లో నిర్వహించారు.
- ఎ, సి మాత్రమే
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
16
5. కిందివాటిలో సరైనవి గుర్తించండి.
ఎ) ఐక్యరాజ్యసమితిలోని శక్తిమంతమైన భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను 2022, డిసెంబరు 1న భారత్ చేపట్టింది.
బి) 15 దేశాల భద్రతా మండలిలో డిసెంబరు నెలకుగాను అధ్యక్ష పీఠంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ కొనసాగుతారు.
సి) 2021 ఆగస్టులో కూడా భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహించింది. మండలిలో భారత్ రెండేళ్ల పదవీకాలం 2022 డిసెంబరుతో ముగియనుంది.
డి) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష పదవీకాలం ఒక నెల మాత్రమే. ఈ మండలిలోని 5 శాశ్వత, 10 తాత్కాలిక సభ్యదేశాలు అక్షర క్రమంలో ఒక్కో నెల పాటు అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తాయి.
- ఎ, బి మాత్రమే
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
20
7. కింది అంశాల్లో సరైనవి గుర్తించండి.
ఎ) భారత నావికాదళ దినోత్సవాన్ని 2022 డిసెంబరు 4న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, భారత నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, అజయ్‌భట్ తదితరులు పాల్గొన్నారు.
బి) తొలిసారిగా దిల్లీకి వెలుపల రాష్ట్రపతి ఆధ్వర్యంలో నౌకాదళ దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించారు. పాకిస్థాన్ పై 1971లో జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న 'నేవీ డే' వేడుకలను నిర్వహిస్తున్నారు.
సి) ప్రసేన్ జోషీ రచించిన 'కాల్ ఆఫ్ ద బ్లూ వాటర్' పాటను రాష్ట్రపతి ఈ కార్యక్రమంలో విడుదల చేశారు. గాయకుడు శంకర్ మహదేవన్ ఈ పాటను ఆలపించారు.
డి) విశాఖపట్నాన్ని 'సిటీ ఆఫ్ డెస్టినీ' అని పిలుస్తారు.
- ఎ, సి మాత్రమే
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
28
8. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ కోల్‌కతాలో టోర్నీ బ్లిట్జ్ బ్లిట్జ్ ఈవెంట్ జరిగింది. ఇందులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు.
బి) అమెరికాకు చెందిన నకముర రెండోస్థానంలో నిలిచాడు.
సి) బ్లిట్జ్ ఈవెంట్ మహిళల విభాగంలో భారతికి చెందిన వైశాలి టైటిల్ విజేతగా, ఉక్రెయిన్ క్రీడాకారిణి మరియా రన్నరప్ గా నిలిచారు.
డి) బ్లిట్జ్ ఈవెంట్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానంలో నిలిచింది.
- ఎ మాత్రమే
- ఎ, బి మాత్రమే
- ఎ, సి మాత్రమే
- పైవన్నీ
32
10. కింది అంశాల్లో సరైనవి గుర్తించండి.
ఎ) 2022, డిసెంబరు 5, 6, 7 తేదీల్లో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను ముంబయిలో నిర్వహించారు.
బి) ఆర్బీఐ కీలక రెపోరేటును మరో 35 బేసిస్ పాయింట్ల (0.35%) మేర పెంచడంతో 6.25 శాతానికి చేరింది.
సి) ఈ ఏడాది మే నుంచి అయిదు విడతల్లో మొత్తంగా 225 బేసిస్ పాయింట్ల (2.25%) మేర రెపోరేటును ఆర్బీఐ పెంచింది. గత మూడు సందర్భాల్లో 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచగా, ఈసారి కాస్త తగ్గించింది.
డి) 2022 - 23 లో భారత వృద్ధిరేటు 6.8% గా నమోదు కావచ్చని ఆర్బీఐ తాజాగా అంచనా వేసింది. వృద్ధిరేటు 7.8% గా ఉండొచ్చని ఈ ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేయగా, ఏప్రిల్‌లో 7.2%, సెప్టెంబరులో 7% శాతానికి ఆర్బీఐ సవరించింది. ఇప్పుడు దాన్ని మరింత తగ్గించింది.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
40