1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులన్నింటినీ సామాజిక మాధ్య మాలు గౌరవించాలని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ కొన్ని సవరణలతో 2022, అక్టోబరు 28న నోటిఫికేషన్ జారీచేసింది.
బి) రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు అందరూ సమానమే), 19 (భావ ప్రకటన స్వేచ్ఛ), 21 (జీవితానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ) కింద పొందుప రచిన ప్రాథమిక హక్కులతో సహా అన్ని పౌర హక్కులనూ గౌరవించాలని కేంద్రం ఈ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
సి) సామాజిక మాధ్యమాల వినియోగానికి సంబంధించిన నియమ నిబంధనలు, గోప్యత విధానం, వినియోగ ఒప్పందా లను (యూజర్ అగ్రిమెంట్) ఇంగ్లిష్తో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భారతీయ భాషల్లో దుబాటులో ఉంచాలని కేంద్రం స్పష్టం చేసింది.
డి) సంస్థల తీరుపై బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోపు దాన్ని గుర్తించడంతోపాటు 15 రోజుల్లోగా పరి ష్కరించాలని స్పష్టంచేసింది. సామాజిక మాధ్యమాల్లోని ఏదైనా సమాచారాన్ని లేదా కమ్యూనికేషన్ లింక్‌ను తొలగించ డానికి సంబంధించిన ఫిర్యాదు అయితే దాన్ని 72 గంటల్లోపు పరిష్కరించాలని నిర్దేశించింది.
- ఎ, బి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
4
2. 'హెల్తీ లంగ్స్ మంత్ ' ను ప్రపంచవ్యాప్తంగా ఏ నెలలో నిర్వహిస్తారు? (ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులపై అవగాహన కల్పిం చేందుకు దీన్ని జరుపుతారు.)
- సెప్టెంబరు
- డిసెంబరు
- నవంబరు
- అక్టోబరు
8
3. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల విభాగం ఆధ్వర్యంలో 2022, నవంబరు 6న ఈజిప్ట్ ని షర్మ్ ఎల్ షేక్ పట్ట ణంలో కాప్-27 సదస్సు ప్రారంభమైది.
బి) నవంబరు 18 వరకూ ఈ సదస్సు జరుగుతుంది.
సి) ఐరాస 1995 నుంచి ఈ సదస్సును నిర్వహిస్తోంది.
డి) 2050 నాటికి సగటు భూతాపం పెరు గుదలను రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చేస్తామంటూ 196 దేశాలు 2015 ప్యారిస్ ఒప్పందంలో సంతకాలు చేశాయి. 2030 నాటికి 50 శాతానికి, 2050 నాటికి కర్బన ఉద్గారాల సమూల నియంత్రణకు పర్యావరణహిత కార్యక్ర అమలు చేస్తామని హామీ మాలను ఇచ్చాయి.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
12
4. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) దేశంలో బీమా రంగాన్ని పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని ఐఆర్ డీఏఐ (భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ) నిర్ణయించింది. దీని కోసం 'బీమా సుగమ్' పేరుతో ఆన్లైన్ వేదికను ప్రారంభించనుంది.
బి) బీమా పాలసీల కొనుగోలు, విక్రయాలు సహా అన్ని సేవలకూ ఉమ్మడి వేదికగా 'బీమా సుగమ్' ఉంటుంది. క్లెయిమ్‌ల పరిష్కారాలు సైతం దీని ద్వారానే జరు గుతాయని ఐఆర్డీఏఐ వెల్లడించింది.
సి) బీమారంగంలో ఏటా ఆరున్నర శాతం వృద్ధి రేటు నమోదవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే 2022 చివరినాటికి దేశంలో జీవిత బీమా ప్రీమియాలు రూ.8.25 లక్షల కోట్లను దాటవచ్చని అంచనా.
డి) ఐఆర్డీఏ ప్రస్తుత చైర్మన్ దేవాశీష్ పాండా.
- ఎ మాత్రమే
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
16
5. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (ప్రజల్లో ఈ అవగాహన కల్పించేందుకు వ్యాధి పై 2014లో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ జాతీయ క్యాన్సర్ అవగా హన దినోత్సవాన్ని ప్రకటించారు. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియంను పోలండ్ దేశానికి చెందిన మేడం క్యూరీ కనిపెట్టారు. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా న్యూక్లియర్ ఎనర్జీ, రేడియోథెరపీ క్యాన్సర్ వైద్య సేవలను ఆమె వృద్ధి చేశారు. ఆమె జయంతి కూడా ఇదే రోజు.)
- నవంబరు 6
- నవంబరు 7
- నవంబరు 9
- నవంబరు 10
18
7. ప్రముఖ కవి, రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎన్నో జయంతిని 2022, నవంబరు 1న నిర్వహించారు? (ఈయన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని చంద్రం పాలెంలో జన్మించారు.)
- 115వ జయంతి
- 145వ జయంతి
- 125వ జయంతి
- 135వ జయంతి
27
8. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) దేశంలో తొలిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ-హోల్‌సేల్ (e-W) ప్రయోగాత్మక కార్యకలాపాలు 2022, నవంబరు 1 నుంచి టోకు విభాగంలో మొదలయ్యాయి.
బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్ బీసీలు ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదే వీల కోసం డిజిటల్ రూపాయి జారీని ప్రారంభించాయి.
సి) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీ డీసీ) అనేది ప్రస్తుత కరెన్సీ నోట్లకు డిజి టల్ రూపం మాత్రమే. వీటికి ప్రత్యా మ్నాయం కాదు. ప్రస్తుత నగదు కొనసా గుతుంది. అదనపు చెల్లింపు అవకాశా లను కల్పించేందుకే సీబీడీసీని తీసుకొచ్చి నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
- బి, సి
- ఎ, బి
- ఎ, సి
- పైవన్నీ
32
9. లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? (2023, జనవరి 1న ఈయన మూడోసారి ఆ దేశాధ్య క్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. )
- బ్రెజిల్
- చిలీ
- ఉరుగ్వే
- రువాండా
33
10. ఆహారధాన్యాల రవాణా ఒప్పందంలో తిరిగి చేరేందుకు రష్యా అంగీకరించింది. దీని కోసం ఐక్యరాజ్యసమితితో పాటు ఏ దేశం రష్యాతో మధ్యవర్తిత్వం చేశాయి?
- అమెరికా
- జర్మనీ
- టర్కీ
- ఫ్రాన్స్
39