1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 2022, నవంబరు 26న సుప్రీంకోర్టులో నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.
బి) ఈ కార్యక్రమంలో మోదీ 'వర్చువల్ జస్టిస్ క్లాక్', 'జస్ట్ ఐఎస్' మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్ 'ఎస్ 3 డబ్ల్యూఏఏ ఎస్' వెబ్సైట్లను ప్రారంభించారు. వీటి ద్వారా కక్షిదారులు, లాయర్లు, న్యాయవ్యవ స్థతో సంబంధం ఉన్న అందరికీ టెక్నాలజీ ఆధారిత సేవలు అందించవచ్చు.
సి) ముంబయి ఉగ్రదాడి (2008, నవంబరు 26) జరిగి 14 ఏళ్లు పూర్తయిన సంద ర్భంగా ఆ దాడుల్లో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.
- ఎ, బి
- ఎ మాత్రమే
- ఎ, సి
- పైవన్నీ
4
2. ఏవియన్ ఫ్లూ వ్యాధి కారణంగా ఈ ఏడాది ఏ దేశంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 5 కోట్ల కోళ్లు, పక్షులు మరణించాయి? (ఆ దేశ చరిత్రలోనే ఇది అత్యంత ప్రాణాంతక మైన విపత్తు అని అక్కడి వ్యవసాయ శాఖ పేర్కొంది. హైలీ పాథోజెనిక్ ఎవియన్ ఇన్ ప్లూయెంజా - హెచ్పీఏఐ గా పిలిచే ఈ ఫ్లూ అడవి బాతుల వ్యర్థాలు, ఈకల ద్వారా సోకుతుంది. )
- న్యూజిలాండ్
- పాకిస్థాన్
- అమెరికా
- చైనా
7
4. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ప్రపంచవ్యాప్తంగా 2022లో ప్రవాసులు నివసించేందుకు అనువైన అత్యుత్తమ నగ రాల జాబితాను జర్మనీకి చెందిన ఇంటర్నే షన్స్ సంస్థ వెల్లడించింది. ఇందులో మొత్తం 420 నగరాలు ఉన్నాయి. ఈ జాబితాలో స్పెయిన్లోని వెలెన్సియా అగ్ర స్థానంలో నిలిచింది. ఇక్కడి అద్భుతమైన జీవన ప్రమాణాలు, జీవన వ్యయం భరించే స్థాయిలో ఉండటం, ప్రజలు స్నేహపూర్వకంగా మెలగడం లాంటి కార ణాలతో దీనికి మొదటి ర్యాంకు దక్కింది.
బి) దుబాయ్, మెక్సికో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
సి) పోర్చుగల్ రాజధాని లిస్బన్, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ వరుసగా 4, 5 స్థానాల్లో చోటు పొందాయి.
డి) బ్యాంకాక్, స్విట్జర్లాండ్లోని బాసిల్ నగ రాలు వరుసగా 6, 7 స్థానాల్లో ఉన్నాయి.
- ఎ మాత్రమే
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
16
5. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) జులై - సెప్టెంబరు త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత శాతంగా నమో దైంది? (2021-22 ఇదే త్రైమాసికంలో మన దేశ వృద్ధి 8.4 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ లో వృద్ధి 13.5 శాతంతో పోలిస్తే జులై-సెప్టెంబరు త్రైమాసికంలో తక్కువగా నమోదైంది. అయి నప్పటికీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసా గుతోంది. జులై - సెప్టెంబరులో చైనా వృద్ధి రేటు 3.9 శాతంగా నమోదైంది. )
- 6.1 శాతం
- 6.9 శాతం
- 6.6 శాతం
- 6.3 శాతం
20
6. 2022, డిసెంబరు 1 నుంచి ఎంతకాలం పాటు భారత్ జీ-20 కూటమికి నేతృత్వం వహించనుంది? (ఈ సందర్భంగా దేశంలోని సుమారు 100 చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద భవనాలను జీ-20 చిహ్నంతో విద్యుత్ దీపాలతో అలంకరించాలని కేంద్ర పర్యాటక శాఖ నిర్ణయించింది.)
- నాలుగేళ్లు
- రెండేళ్లు
- మూడేళ్లు
- ఏడాది
24
7. ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక సూపర్ స్టార్స్ ఆఫ్ స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్) అవార్డుకు ఎన్నికైన భారతీయ మూలాలున్న మహిళలు ఎవరు? (సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్ట్రేలియా - ఎస్ టీఏ ఏటా 60 మందికి ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. ఇందులో లక్షకుపైగా శాస్త్ర వేత్తలు, సాంకేతిక నిపుణులు ప్రతినిధులుగా ఉన్నారు. )
ఎ) నీలిమ కడియాల
బి) డాక్టర్ అనా బబురమణి
సి) డాక్టర్ ఇంద్రాణి ముఖర్జీ
డి) డాక్టర్ మనికా అగర్వాల్
- ఎ, బి, సి
- బి, సి, డి
- ఎ, బి, డి
- పైవారంతా
25
8. ఐక్యరాజ్య సమితి ప్రతిష్ఠాత్మక పురస్కారం 'ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్'కి ఎంపికైన అసోం మహిళ ఎవరు? (అసోంలో అరుదైన జాతికి చెందిన, అంతరించి పోతున్న గ్రేటర్ ఆజి టెంట్ జాతి కొంగల సంరక్షణ కోసం ఈమె 'హర్గిల ఆర్మీ'ని ఏర్పాటు చేశారు. అస్సామీలు కొంగను 'హర్గిల' అని పిలుస్తారు.)
- ఆశ్రితా చక్రవర్తి
- ప్రియాన్షి సాధన
- పూర్ణిమా దేవి బర్మన్
- అభినందా బబినా
31
9. ప్రపంచ పురుషల టీమ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ డేవిస్ కప్ - 2022ని ఏ జట్టు నెగ్గింది? (స్పెయిన్ లో జరిగిన ఫైనల్లో ఈ జట్టు 2-0 తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. 122 ఏళ్ల డేవిస్ కప్ చరిత్రలో ఈ జట్టుకి ఇదే తొలి టైటిల్.)
- అర్జెంటీనా
- బెల్జియం
- కెనడా
- జర్మనీ
35