1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 'డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ' పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022, అక్టో బరు 28 నుంచి కొత్తగా మరో 809 వైద్య చికిత్సలను చేర్చింది. దీంతో ఇప్ప టికే ఈ పథకం కింద ఉన్న 2,446 చికిత్సలతో కలిపి వీటి సంఖ్య 3,255కి చేరింది.
బి) వైద్యం ఖర్చు రూ. 1000 దాటిన అన్ని చికిత్సలు ఈ పరిధిలోకి వస్తాయి. ఈ పథకం లబ్ధిదారుల వార్షిక ఆదాయ పరి మితిని ప్రభుత్వం రూ. 5 లక్షలకు పెంచింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 95 శాతం (1,41,23,843) కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సి) ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా, బ్లాక్ ఫంగస్, మిస్-సి లాంటి జబ్బులను ప్రభుత్వం చేర్చింది.
డి) ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లాక కూడా, వారు పూర్తిగా కోలుకుని తిరిగి పనుల్లోకి వెళ్లేవరకు జీవనోపాధికి ఎలాంటి లోటు లేకుండా 'వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా' ద్వారా రోజుకు రూ. 225 చొప్పున నెలకు రూ. 5,000; రెండు నెలలకు రూ. 10 వేలు ఈ విధంగా ఎన్ని రోజులైనా డాక్టర్ సూచ నల మేరకు ఆరోగ్య ఆసరా భృతి అందిస్తారు.
- ఎ, బి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
4
6. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎస్ఎస్ సీ) ఆధ్వర్యంలో 2022, అక్టోబరు 29న దిల్లీలో కౌంటర్ టెర్ర రిజం కమిటీ (సీటీసీ) ప్రత్యేక సమావే శాన్ని నిర్వహించారు.
బి) భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల ప్రతినిధులు, పలువురు అంతర్జాతీయ నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు.
సి) 'ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజం'కి 2022 ఏడాదికి భారత్ స్వచ్చందంగా 5 లక్షల డాలర్లు ఇవ్వను న్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు.
డి) సీటీసీ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న సభ్యదేశాల ప్రతినిధులు 'దిల్లీ డిక్లరేషన్ ను ఆమోదించారు. ఉగ్రచర్యలపై యూఎన్ ఎస్ సీ భారత్ లో ఒక సమావేశం నిర్వ హించడం ఇదే తొలిసారి.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
24
7. పాకిస్థాన్లోని ఏ రెండు నగరాలను కలు పుతూ రైలు మార్గం నిర్మించేందుకు చైనా ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? (దీని వ్యయం 10 బిలియన్ డాలర్లు. చైనా - పాకి స్థాన్ ఎకనామిక్ కారిడార్ - సీపె లో ఈ రైలు మార్గం అత్యంత కీలకమైంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రతిష్టాత్మకంగా ప్రకటిం చిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ లో సీపెక్ ఒక భాగం.)
- కరాచీ - లాహోర్
- కరాచీ - పెషావర్
- కరాచీ - రావల్పిండి
- కరాచీ - ఇస్లామాబాద్
26
8. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2035 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు - వ్యాన్ల తయారీపై నిషేధం విధించాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు నిర్ణయించాయి. దీనికి సంబం ధించిన మొట్టమొదటి 'ఫిట్ ఫర్ 55' ప్యాకేజీపై ఈ దేశాలన్నీ 2022, అక్టో బరు 27న ఒక అంగీకారానికి వచ్చాయి.
బి) ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 55% మేర తగ్గిం చడమే ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశం. దీని ప్రకారం కార్లు, వ్యాన్ల నుంచి వెలువడే ఉద్గారాలను 2030 నాటికి 55 శాతానికి తగ్గించి, 2035 కల్లా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది.
సి) ఈ ఒప్పందం అమల్లోకి రావాలంటే ముందుగా ఈయూ పార్లమెంట్, సభ్యదే శాలు దీనికి ఆమోదం తెలపాలి.
డి) 2050 నాటికి వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఈయూ భావిస్తోంది.
- ఎ, డి
- ఎ, బి
- ఎ, బి, సి
- పైవన్నీ
32
9. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2022, నవంబరు 6-18 తేదీల మధ్య ఈజిప్టో జరగనున్న ఐరాస పర్యావ రణ సదస్సు (కాప్-27) సందర్భంగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్య క్రమం (యూఎన్ ఈపీ) ఒక నివేదికను విడుదల చేసింది. దీని పేరు 'ఎమి షన్స్ గ్యాప్ రిపోర్ట్ 2022: క్లోజింగ్ విండో'.
బి) దీని ప్రకారం, 2020లో కర్బన ఉద్గా రాల ప్రపంచ తలసరి 6.3 టన్నులు (కార్బన్ డై ఆక్సైడ్ ఈక్వలెంట్) ఉండగా, భారత్ సగటు 2.4 టన్నులుగా ఉంది.
సి) 2020లో వివిధ దశల్లో తలసరి కర్బన ఉద్గారాల విడుదల: అమెరికా - 14 టన్నులు, రష్యా - 13 టన్నులు, చైనా - 9.7 టన్నులు, బ్రెజిల్, ఇండోనేసియా - 7.5 టన్నులు.
డి)భూతాపాన్ని గణనీయంగా తగ్గించుకోవా లన్న ఉమ్మడి లక్ష్యంతో ప్రపంచ దేశాలు 2015లో పారిస్ ఒప్పందం పై అవగాహనకు వచ్చాయి. ఈ శతాబ్దం చివరికి భూతాపంలో పెరుగుదలను 2°C కంటే తగ్గించాలని లక్ష్యంగా పెట్టు కున్నాయి. పారిశ్రామిక యుగానికి ముందునాటితో పోలిస్తే ఈ పెరుగుద లను 1.5°C కి పరిమితం చేయాలని నిర్ణయించాయి.
- బి, సి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
36