1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) సాధారణ గూడ్స్ రైలు కంటే 3 రెట్లు పెద్దదైన 'సూపర్ వాసుకి'ని ఆగ్నేయ మధ్య (సౌత్ ఈస్ట్ సెంట్రల్) రైల్వే ప్రయోగాత్మకంగా నడిపింది.
బి) దీని పొడవు మూడున్నర కిలోమీటర్లు. 295 వ్యాగన్లు ఉన్నాయి. ఇది 2022, ఆగస్టు 15న 27 వేల టన్నులకు పైగా బొగ్గుతో ఛత్తీస్ గఢ్ లోని కోర్బా నుంచి రాజ్ నంద గావ్ వరకు ప్రయాణించింది. మొత్తం 267 కి. మీ. దూరాన్ని 11.20 గంటల్లో చేరుకుంది.
సి) దేశంలో ఇప్పటివరకు నడిపిన అత్యంత పొడవైన, అతిభారీ గూడ్స్ రైలు ఇదేనని రైల్వేశాఖ వెల్లడించింది.
డి) ప్రస్తుత రైల్వేశాఖ మంత్రి నితిన్ గడ్కరి.
- ఎ, బి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
3
3. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) పై అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా) 2022, ఆగస్టు 16న నిషేధం విధించింది. ఏఐఎస్ఎలో బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. 85 ఏళ్ల చరిత్ర ఉన్న ఏఐ ఎస్ఎఫ్ సస్పెన్షన్కు గురవ్వడం ఇదే తొలిసారి.
బి) భారత ఫుట్ బాల్ జట్టు ప్రస్తుత కెప్టెన్ సునీల్ ఛెత్రి.
సి) ఫిఫాలో మొత్తం 211 దేశాలకు సభ్యత్వం ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారత పురుషుల జట్టు 104వ స్థానంలో, భారత మహిళల జట్టు 58వ స్థానంలో ఉన్నాయి.
డి) ఫిఫా కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జ్యూరిలో ఉంది. ఫిఫా నినాదం 'ఫర్ ది గేమ్ ఫర్ ది వరల్డ్
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
12
4. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2022, ఆగస్టు 15న ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని ఎర్రకో టపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
బి) ప్రధానిగా మోదీ పతాకావిష్కరణ చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. 'జై జవాన్.. జై కిసాన్ 'జై విజ్ఞాన్ నినాదాలకు తోడుగా 'జై అనుసంధాన్ అంటూ కొత్త నినాదాన్ని ఇచ్చారు.
సి) ఈసారి స్వాతంత్ర్య వేడుకల్లో తొలిసారిగా '21 గన్ సెల్యూట్' కోసం భార త్ లో తయారైన హోవిట్జర్ శతఘ్నిని వినియోగించారు. ఈ వేడుకల్లో ఇదివ రకు బ్రిటిష్ వారు తయారు చేసిన తుపాకుల్ని వాడేవారు.
- బి, సి
- ఎ, బి
- ఎ, సి
- పైవన్నీ
16
5. కింది అంశాల్లో సరైంది ఏది?
ఎ) భారత నౌకాదళ వైస్ చీఫ్ అడ్మిరల్ సతీష్ నామ్ దేవ్ మర్మడే 2022, ఆగస్టు 14, 15 తేదీల్లో శ్రీలంకలో పర్యటించారు.
బి) ఈ సందర్భంగా శ్రీలంక సముద్ర భద్రత మరింత బలో పేతమయ్యేలా మనదేశా నికి చెందిన డోర్నియర్ సముద్ర నిఘా విమానాన్ని బహుమతిగా ఇచ్చారు.
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- ఏదీకాదు
- పైవన్నీ
20
6. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏ శకటాలు వరుసగా తొలి మూడు బహుమతులు గెలుచుకు న్నాయి?
- మనబడి నాడు - నేడు (విద్యాశాఖ), గడప గడపకు మన ప్రభుత్వం ఇంటింటా సంక్షేమం (గ్రామ, వార్డు సచి వాలయాల శాఖ), నవరత్నాలు - పేద లందరికీ ఇళ్లు (గృహనిర్మాణ శాఖ)
- నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు (గృహ నిర్మాణశాఖ), మనబడి నాడు - నేడు (విద్యాశాఖ), గడప గడపకు మన ప్రభుత్వం - ఇంటింటా సంక్షేమం (గ్రామ, వార్డు సచివాలయాల శాఖ)
- గడప గడపకు మన ప్రభుత్వం ఇంటింటా సంక్షేమం (గ్రామ, వార్డు సచి వాలయాల శాఖ), నవరత్నాలు - పేద లందరికీ ఇళ్లు (గృహ నిర్మాణశాఖ), మనబడి నాడు - నేడు (విద్యాశాఖ)
- 'గడప గడపకు మన ప్రభుత్వం - ఇంటింటా సంక్షేమం' (గ్రామ, వార్డు సచి వాలయాల శాఖ), మనబడి నాడు - నేడు (విద్యాశాఖ), నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు (గృహనిర్మాణ శాఖ)
24
8. మయన్మార్ మాజీ స్టేట్ కౌన్సిలర్ అంగ్ సాన్ సూకీ (77)కి అక్కడి న్యాయస్థానం వివిధ అవినీతి కేసుల్లో ఎన్నేళ్ల జైలు శిక్ష విధిం చింది? (1991లో ఈమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. సూకీ సారథ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని మయన్మార్ సైనిక పాలకులు కూల్చి, 2021 ఫిబ్రవరిలో ఆమెను నిర్బంధంలో ఉంచారు. దేశద్రోహం, అవినీతి తదితర ఆరోపణలపై ఆమెకు ఇప్పటికే 11 ఏళ్ల జైలుశిక్ష పడింది.)
- మూడేళ్లు
- నాలుగేళ్లు
- ఆరేళ్లు
- అయిదేళ్లు
31
10. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) తెలంగాణ ప్రభుత్వం 2022, ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజుల పాటు భారత స్వాతంత్ర్య వజోత్సవాలను నిర్వహించింది.
బి) 2022, ఆగస్టు 15న సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రంలో మొత్తం పంటసాగు విస్తీర్ణం 2014లో 1.34 కోట్ల ఎకరాలు ఉండగా, 2020-21 నాటికి అది 2.15 కోట్లకు విస్తరించినట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
సి) రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు 84,945 రైతు కుటుంబాలకు రూ. 4,247 కోట్లను అందించినట్లు, రాష్ట్ర జీఎడీపీలో 18.6 శాతం వ్యవసాయ రంగం నుంచి సమకూరుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో 11.6 శాతం రికార్డుస్థాయి వృద్ధి రేటు సాధించినట్లు తెలిపారు. తెలంగాణ 12.01% ఉత్పత్తి రంగ వృద్ధి రేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా ఉన్నట్లు వెల్లడించారు.
డి) వజోత్సవ కమిటీ చైర్మన్ ఎంపీ కేశవరావు.
- ఎ, డి
- ఎ, బి
- ఎ, బి, సి
- పైవన్నీ
40