1. దేశవ్యాప్తంగా ఎన్ని పారిశ్రామిక కారిడార్లను 4 దశల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది?
(జాతీయ పారిశ్రామిక కారిడార్ కార్యక్రమం (ఎన్ ఐసీపీ)లో భాగంగా ఈ కారిడార్లను 32 ప్రాజెక్ట్ లతో అభివృద్ధి చేస్తారు.)
- 11
- 17
- 15
- 25
1
2. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) తూర్పు లద్దాఫ్ లో 19,300 అడుగుల ఎత్తులో ఉమ్ లింగ్లా కనుమ వద్ద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ ఓ) ఓ రహదా రిని నిర్మించింది.
బి) దీని పొడవు 52 కిలో మీటర్లు.
సి) దీన్ని ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్ కంటే ఎత్తయిన ప్రదేశంలో నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదే శంలో నిర్మించిన రహదారిగా దీన్ని కేంద్రం ప్రకటించింది.
డి) గతంలో ఈ రికార్డు బొలీవియాలోని యుటారాంకు అగ్ని పర్వతాన్ని కలు పుతూ నిర్మించిన రోడ్డు (18,975 అడుగులు) పేరిట ఉంది.
- ఎ, బి
- బి, సి
- సి, డి
- పైవన్నీ
8
4. తెలంగాణలో ఆసరా వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 ఏళ్ల నుంచి ఎన్నే ళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? (తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ. 2,016 చొప్పున లబ్దిదారులకు ఆసరా పింఛన్ ను అందిస్తోంది. )
- 62 ఏళ్లు
- 60 ఏళ్లు
- 57 ఏళ్లు
- 52 ఏళ్లు
15
5. దేశంలో వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషనను పూర్తి చేసిన తొలి నగరం? (దీని కోసం నగరవ్యాప్తంగా 55 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జులై 30 నాటికి ఈ నగరంలో 18,35,000 డోసులు వేశారు. )
- భువనేశ్వర్
- తిరువనంతపురం
- గాంధీనగర్
- నాగ్ పుర్
17
6. భారత్ లో యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నే షనల్ డెవలప్ మెంట్ (యూఎస్ఎయిడ్) నూతన మిషన్ డైరెక్టర్గా ఎవరు బాధ్య తలు స్వీకరించారు? (మిషన్ డైరెక్టర్గా ఈమె ఇండియా, భూటాన్లలో యూఎస్ ఎయిడ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఈమె ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు. అమె రికాలో పెరిగి అక్కడ అమెరికా ఫారిన్ సర్వీస్ అధికారిగా ఎంపికయ్యారు. )
- కీర్తి రెడ్డి
- అనితా రెడ్డి
- వీణా రెడ్డి
- స్నేహా రెడ్డి
23
7. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్య క్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవీకాలాన్ని ప్రభుత్వం ఎంతకాలం పాటు పొడిగిం చింది? (2019, ఆగస్టు 26న ఈయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. )
- మూడేళ్లు
- నాలుగేళ్లు
- ఏడాది
- రెండేళ్లు
28