1. కింది అంశాల్లో సరైంది?
ఎ) వివిధ బ్యాంకులకు చెందిన 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (డీబీయూ)ను ప్రధాని నరేంద్ర మోదీ 2022 అక్టోబరు 16న దిల్లీలో జాతికి అంకితం చేశారు.
బి) సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్దిదారులకే అందించే పథకం ద్వారా 2022 అక్టోబరు 16 నాటికి రూ. 25 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ప్రధాని ఈ కార్యక్రమంలో ప్రకటించారు.
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- రెండూ సరికాదు
- రెండూ సరైనవే
4
2. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) అల్యూమినియంతో తయారైన గూడ్స్ రైలును రైల్వేశాఖ తొలిసారిగా 2022 అక్టోబరు 16న భువనేశ్వర్ నుంచి భిలాస పూర్ వరకు నడిపింది.
బి) ఈ తొలి అల్యూమినియం గూడ్స్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
సి) ఆర్ డీఎఓ (రిసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్), హిండాల్కో, బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ రైలును తయారు చేశారు.
- ఎ మాత్రమే
- ఎ, బి మాత్రమే
- ఎ, సి మాత్రమే
- పైవన్నీ
7
4. కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎంత శాతం ప్రభుత్వ పాఠశా లల్లో కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి? (దేశంలోని 11.58% పాఠశాల ల్లోనే ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. 88% బడులకు అంతర్జాల సదుపాయాన్ని కల్పించిన దిల్లీ జాబితాలో మొదటిస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సాంకేతిక సదుపాయం 10% లోపే ఉంది.)
- 18.55%
- 28.55%
- 38.55%
- 58.55%
14
5. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఏ సంవత్సరం నాటి భారతీయ అటవీ చట్టం (ఐఎస్ఏ)లో కీలక మార్పులు తేవాలని నిర్ణ యించింది? (భారత అటవీశాఖ 2019 నాటి అంచనాల ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల వాటా 21.67%గా ఉంది. 2017తో పోలిస్తే 2019 నాటికి దేశంలో అడవులు, చెట్ల విస్తీర్ణం 0.65% పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణాల్లో అడవుల వాటా వరుసగా 17.88%, 18.36%గా ఉంది. )
- 1921
- 1927
- 1925
- 1923
18
7. పోలెండ్ క్రీడాకారిణి అనితా వొడార్జిక్ వరుసగా మూడు ఒలింపిక్‌లో (2012, 2016, 2020) ఏ క్రీడలో స్వర్ణం గెలిచింది? (ఒలింపిక్స్ క్రీడల అథ్లెటిక్స్ లో వ్యక్తిగత విభాగంలో వరుసగా మూడు పసిడి పత కాలు నెగ్గిన తొలి క్రీడాకారిణిగా ఈమె రికార్డు నెలకొల్పారు.)
- డిస్కస్ త్రో
- హ్యామర్ త్రో
- హై జంప్
- లాంగ్ జంప్
26
9. ఆంధ్రప్రదేశ్ లో విభిన్న ప్రతిభావంతుల కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్లను ఎంత కాలం పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది?
- మూడేళ్లు
- పదేళ్లు
- ఏడేళ్లు
- అయిదేళ్లు
34