1. ప్రపంచవ్యాప్తంగా పోలియో నివారణ కోసం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచేందుకు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎంత మొత్తం సాయాన్ని ప్రకటించింది? (పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తదితర దేశాలను పోలియో రహితంగా మార్చేందుకు, వైరస్ కొత్త వేరియంట్ల వ్యాప్తి నివారణకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తామని ఫౌండేషన్ ప్రకటించింది)
- 1 బిలియన్ డాలర్లు
- 1 .4 బిలియన్ డాలర్లు
- 1 .2 బిలియన్ డాలర్లు
- 1.8 బిలియన్ డాలర్లుీ
3
2. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) నగరాల్లో పరిసరాల పరిశుభ్రత పై పౌరుల్లో అవగాహన పెంచడానికి, వారిని భాగస్వాములను చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో 'స్వచ్చ భారత్ మిషన్ అర్బన్ 2.0' ప్రారంభించింది.
బి) ఈ సర్వే ప్రధాన లక్ష్యం-2026 కల్లా దేశంలోని నగరాలన్నింటినీ చెత్తలేని నగరాలుగా తయారు చేయడం.
సి ) 'స్వచ్ఛ సర్వేక్షణ్-2022' పురస్కారాల్లో ఇండోర్ మొదటిసారిగా 7,146 స్కోరుతో సెవెన్ స్టార్ రేటింగ్ సంపాదించింది. 2017 నుంచి వరుసగా ఆరోసారి దేశంలోనే స్వచ్ఛ నగరంగా అవార్డు గెలుచుకుంది.
డి) తెలుగు వ్యక్తి, సీనియర్ ఐఏఎస్ అధికారి పి. నరహరి 'స్వచ్చ ఇండోర్' పేరుతో ఓ పుస్తకం రచించారు. ఇండోర్ మొదటిసారి స్వచ్ఛ అవార్డు గెలుపొందినప్పుడు ఆయన ఆ జిల్లా కలెక్టరుగా ఉన్నారు.
- ఎ, బి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
8
3. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) 12వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ 2022 అక్టోబరు 17న అర్హులైన రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు.
బి) దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ప్రాంగణంలో కేంద్ర వ్యవసాయ, ఎరువుల శాఖల ఆధ్వర్యంలో జరిగిన 'పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ - 2022' కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను విడుదల చేశారు.
సి) ఈ విడతలో దాదాపు రూ. 16 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.2.16 లక్షల కోట్ల సాయం అందించినట్లైంది. పీఎం-కిసాన్ కింద అర్హులకు ఏటా మూడు విడతల్లో రూ. 6000 అందిస్తున్నారు.
డి ) ఈ కార్యక్రమంలో 'ఒకే దేశం, ఒకే ఎరువుల పథకం'లో భాగంగా 'భారత్' బ్రాండ్ రాయితీ యూరియాను ప్రధాని ఆవిష్కరించారు. 600 పీఎం-కిసాన్ సమృద్ధి కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ ఎరువుల ఈ వారపత్రిక 'ఇండియన్ ఎడ్జ్'నూ ఆవిష్కరించారు.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
12
4. కింది అంశాల్లో సరైనవి?
ఎ) ఆంధ్రప్రదేశ్ లో 'సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (సాల్ట్) ప్రాజెక్టు అమలు పురోగతి సంతృప్తికరంగా సాగుతోందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది.
బి) 'సాల్ట్' ద్వారా రాష్ట్రంలోని 15 వేలకు పైగా పాఠశాలల్లో అభ్యాస వాతావరణం మెరుగుపడినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
సి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సలహాదారుగా ఆలూరు సాంబశివారెడ్డి నియమితులయ్యారు.
- ఎ మాత్రమే
- సి మాత్రమే
- ఎ, బి మాత్రమే
- పైవన్నీ
16
5. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మిలిటరీ కమిషన్ (సీఎంసీ) అధ్యక్షుడిగా 2022 అక్టోబరులో ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు? (చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ మహాసభల్లో జిన్పింగ్ ఈ బాధ్యతలు చేపట్టారు)
- మూడు
- నాలుగు
- అయిదు
- రెండు
17
6. ట్రాక్షన్ జియో నివేదిక ప్రకారం ప్రపంచంలోని 'మోస్ట్ యాక్టివ్ ఇన్వెస్టర్స్-యాక్సిలరేటర్స్'లో ఐటీ రంగం బలో పేతానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'టీ హబ్' ఏ స్థానంలో నిలిచింది?
- మూడు
- నాలుగు
- అయిదు
- రెండు
23
7. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ఐర్లాండ్ కు చెందిన కన్సర్న్ వరల్డ్ వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్స్
సంస్థలు రూపొందించిన ప్రపంచ క్షుద్బాధ సూచీ (జీహెచ్) - 2022లో భారత్ మొత్తం 121 దేశాలకుగానూ 107వ స్థానంలో నిలిచింది.
బి) 29.1 స్కోరుతో భారత్ లో క్షుద్బాధ స్థాయి చాలా తీవ్రంగా ఉంది.
సి ) 2021 జీహెచ్ఎలో 116 దేశాలకుగానూ భారత్ 101వ స్థానంలో నిలిచింది. తాజా నివేదికలో శ్రీలంక (64), నేపాల్ (81), బంగ్లాదేశ్ (84), పాకిస్థాన్ (99)లు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఆసియాలో భారత్ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ (109) మాత్రమే దిగువ స్థానంలో ఉంది.
డి) ప్రపంచ క్షుద్బాధ సూచీ - 20229 భారత ప్రభుత్వం ఖండించింది.
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- ఎ, బి
- పైవన్నీ
28
9. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ 90వ సమావేశాలను 2022 అక్టోబరు 18 నుంచి 21 వరకు దిల్లీలో నిర్వహించారు.
బి) ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పోలీసు శాఖలను సమన్వయపరచడానికి 1923లో ఇంటర్పోల్ ఆవిర్భవించింది.
సి) అంతర్జాతీయంగా నేరాలపై పోరుకు భారత్ అందిస్తున్న సహకారాన్ని గుర్తించిన ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ గతేడాది సీబీఐ ప్రత్యేక సంచాలకులు ప్రవీణ్ సిన్హాను తన ఆసియా కార్యనిర్వాహక సంఘ ప్రతినిధిగా నియమించింది.
డి) ఇంటర్పోల్ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి యూగెన్ స్టాక్
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- పైవన్నీ
36
10. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని 1992 నుంచి ఏటా అక్టోబరు 17న ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది.
బి) 'డిగ్నిటీ ఫర్ ఆల్ ఇన్ ప్రాక్టీస్' అనే థీమ్ తో 2022 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. సి) 2019లో ప్రపంచంలో 64.8 కోట్ల మంది నిరు పేదలు ఉండగా, 2020 నాటికి వారి సంఖ్య 7.1 కోట్ల (11 శాతం ) మేర పెరిగి 71.9 కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన 'పేదరికం సంపద పంపిణీ - 2022' నివేదికలో వెల్లడించింది. కొత్తగా పెరిగిన 7.1 కోట్ల మందిలో 80 శాతం నిరు పేదలు భారతదేశంలోనే ఉన్నారని నివేదిక పేర్కొంది.
డి) కొవిడ్ వల్ల 2021లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 16 కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారు.
- ఎ, సి
- బి మాత్రమే
- ఎ మాత్రమే
- పైవన్నీ
40