1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) శ్రీమద్రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విరాట్ విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) 2022, ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర
మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.
బి) రామానుజాచార్యుల విగ్రహం ఎత్తు 216 అడుగులు. పంచ లోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విగ్రహంగా ఇది గుర్తింపు పొందింది.
సి) రామానుజాచార్య విగ్రహ ప్రాంగణం (స్పూర్తి కేంద్రం)లో 108 దివ్యదేశాలు (వైష్ణవ క్షేత్రాలు) ఏర్పాటు చేశారు.
డి) రామానుజాచార్య జీవిత కాలం 1017-1137
- ఎ
- ఎ, బి
- ఎ, బి, సి
- పైవన్నీ
4
5. పర్యావరణ మార్పుల కారణంగా మనదేశంలో ఉన్న వృక్షజాతుల్లో ఎంత శాతం అంతరించే దశలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు? (ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన జీవజాతుల్లో దాదాపు 7.8 శాతానికి భారత్ ఆలవాలం. దేశీయంగా పశ్చిమ కనుమలు, నల్లమల, శేషాచలం కొండలు,
హిమాలయాలు, ఈశాన్య ప్రాంతం విభిన్న జీవజాతులకు నిలయాలు.)
- 18%
- 22%
- 28%
- 32%
19
7. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) రూపొందించిన పసిడి గిరాకీ ధోరణులు-2021 నివేదిక ప్రకారం 2021లో భారత్ లో ఎన్ని టన్నుల బంగారం వినిమయం జరిగింది? (డబ్ల్యూజీసీ గణాంకాల ప్రకారం 2020లో
భారత్ లో 446.4 టన్నుల బంగారం వినిమయం అయ్యింది. 2021లో ప్రపంచ వ్యాప్తంగా 4021.3 టన్నుల పుత్తడికి గిరాకీ ఏర్పడింది.)
- 597.3 టన్నులు
- 697.3 టన్నులు
- 797.3 టన్నులు
- 897.3 టన్నులు
27
8. ఆసియాకప్ మహిళల హాకీ టోర్నమెంట్ 2022 టైటిల్ విజేత? (ఒమన్ రాజధాని మస్కట్ లో ఈ టోర్నీని నిర్వహించారు. ఈ జట్టు ఈ టైటిల్ను నెగ్గడం ఇది మూడోసారి. భారత్ ఈ టోర్నమెంట్ లో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది.)
- జపాన్
- మలేసియా
- థాయ్ లాండ్
- సింగపూర్
29