1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ప్రపంచంలోనే భారీ, అత్యంత శక్తిమంత మైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడ బ్ల్యూఎసీ) ప్రయోగాన్ని ఫ్రెంచ్ గయా నాలోని కౌరూ ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా విజయవం తంగా నిర్వహించారు. 2021, డిసెంబరు 25న ఈ ప్రయోగ జరిగింది.
బి) అత్యంత ప్రతిష్టాత్మకమైన జేడబ్ల్యూఎస్ టీని అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగారూపొందించాయి.
సి) 1990లో ప్రయోగించిన హబుల్ స్పేస్ టెలిస్కోప్, విశ్వానికి సంబంధించిన అనేక రహస్యాలను అందించింది. దీనికి కొనసాగింపుగా జేడబ్ల్యూఎసీని ప్రయోగించారు.
డి) విశ్వం పుట్టుక తర్వాత ఏర్పడిన తొలి గెలాక్సీలను జేడబ్ల్యూఎటో శోధిస్తుంది. మన పాలపుంత లాంటి నక్షత్ర మండలాలు ఏర్పడిన తీరును ఇది తెలుపుతుంది.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
4
3. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) జాతీయ సుపరిపాలనా దినోత్సవాన్నిఏటా డిసెంబరు 25న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా దిల్లీలో సుపరి పాలన సూచిక - 2021 (గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ - జీజీఐ)ను విడుదల చేశారు.
బి) ప్రభుత్వ పాలనలోని 10 రంగాల్లో 58 సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ను నిర్ణయించారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 4 విభాగాలుగా విభజించారు. గ్రూప్-ఏలో 10 రాష్ట్రాలు ఉండగా, గుజరాత్ అగ్రస్థానంలో నిలి చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు వరు సగా 9, 10 స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్బిలో మధ్యప్రదేశ్, ఈశాన్య-పర్వత రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిల్లీ ప్రథమ స్థానాల్లో నిలిచాయి.
సి) గ్రూప్-ఏలో పారిశ్రామిక వార్షిక వృద్ధిలో 8.78 స్కోరుతో తెలంగాణ తొలి స్థానంలో ఉండగా, 0.627తో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది.
డి) గ్రూప్-ఏలో వ్యవసాయ, అనుబంధ రంగ విభాగంలో 0.634 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకు సాధిం చింది. 0.413 స్కోరుతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు 2021లో 11.3 శాతంగా ఉంది.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
12
5. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్గా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ), దిల్లీ వైస్ ఛాన్లర్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ నియమితులయ్యారు.
బి) జగదీశ్ కుమార్ అయిదేళ్లు లేదా ఆయనకు 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
సి) ఈయన స్వస్థలం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం.
డి) 1961లో వి.ఎస్. కృష్ణ, 1991-95 మధ్య ప్రొఫెసర్ రాంరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేశారు. వీరి తర్వాత ఈ పదవి చేపట్టిన మూడో తెలుగు వ్యక్తి జగదీశ్ కుమారే.
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
20
6. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2022 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా రఫెల్ నాదల్ (స్పెయిన్) నిలిచాడు. మెల్ బోర్న్ లో జరిగిన ఫైనల్లో 2-6, 6-7, 6-4, 6-4, 7-5తో మెద్వెదేవ్ (రష్యా)పై విజయం సాధించాడు.
బి) రఫెల్ నాదల్ కెరీర్ లో ఇది 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ కు సంబంధించి నాదలకు ఇది రెండో టైటిల్.
సి) ఆస్ట్రేలియన్ ఓపెన్- 2022 మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా ఆప్లే బార్టీ (ఆస్ట్రేలియా) నిలిచింది. ఫైనల్లో 6-3, 7-6తో అమెరికా క్రీడాకారిణి డానియెలీ రోజ్ కొలిన్సను ఓడించింది.
డి) 1978లో క్రిస్ ఒనీల్ తర్వా త ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి బార్టీనే.
- ఎ, బి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
24
9. భారత్, బ్రిటన్ మధ్య చ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టీఏ)లో భాగంగా జరిగిన తొలి విడత చర్చల్లో ఎన్ని అంశాలపై విస్తృతంగా చర్చించారు? (ఈ ఒప్పందం అమల్లోకి వస్తే 2035 నాటికి రెండు దేశాల మధ్య వార్షిక వాణిజ్య బంధం విలువ రూ.2.8 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.)
- 16
- 26
- 36
- 46
34
10. భారత సైన్యానికి కొంకర్-ఎం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను సరఫరా చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఒక ఒప్పందం కుదుర్చుకుంది. బీడీఎల్ ఎక్కడ ఉంది? (ఈ ఒప్పందం విలువ రూ.3131.82 కోట్లు. రష్యాకు చెందిన ఓఈఎం కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని కొంకర్స్-ఎం క్షిపణులను మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నట్లు బీడీఎల్ వెల్లడించింది. బీడీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ మిశ్రా.)
- దిల్లీ
- చెన్నై
- హైదరాబాద్
- బెంగళూరు
39