1. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 'ఆరోగ్య రాష్ట్రాలు - ప్రగతిశీల భారత దేశం' పేరుతో రాష్ట్రాల 4వ ఆరోగ్య సూచీ (2019-20) నివేదికను నీతి ఆయోగ్ 2021, డిసెంబరు 27న విడు దల చేసింది.
బి) ఈ సూచీలో కేరళ (82.20 స్కోర్), తమిళనాడు (72.42) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఉత్తర్ ప్రదేశ్ (30.57) చివరి ర్యాంకులో ఉంది.
సి) ఈ సూచీలో తెలంగాణ 69.96 స్కోర్‌తో మూడో ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్ 69.95 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
- ఎ మాత్రమే
- ఎ, బి
- బి, సి
- పైవన్నీ
4
2. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) 2022లో భారత్, ఫ్రాను అధిగమించి ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని 'వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ (WELT) నివేదిక వెల్లడించింది. లండన్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక కన్సల్టెన్సీ సంస్థ 'ది సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రిసెర్చ్ (సీఈబీఆర్)' దీన్ని రూపొందించింది.
బి) 2021లో భారత్ 7వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2023లో మనదేశం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించి అయిదో స్థానాన్ని చేరుతుందని, 2031 నాటికి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఈ నివేదిక పేర్కొంది.
సి) ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో 100 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.7,500 లక్షల కోట్లు) స్థాయికి చేరవచ్చని సీఈబీఆర్ పేర్కొంది.
డి) 2030 నాటికి అమెరికాను అధిగమించి చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని నివేదికలోవెల్లడించారు.
- ఎ, సి
- ఎ, బి
- బి, డి
- పైవన్నీ
8
3. అఖిల భారత విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ - 2021 విజేతగా ఏ జట్టు నిలి చింది? (ఈ జట్టు ప్రతిష్టాత్మక దేశవాళీ అత్యు త్తమ వన్డే ట్రోఫీని నెగ్గడం ఇదే తొలిసారి. రన్నరప్ గా తమిళనాడు నిలిచింది. )
- కర్ణాటక
- హైదరాబాద్
- హిమాచల్ ప్రదేశ్
- గుజరాత్
11
4. ఏ రాష్ట్రంలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దుచేసే అవకాశాలను పరిశీలించ డానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమి టీని ఏర్పాటు చేసింది? (ఈ కమిటీలో అయి దుగురు సభ్యులు ఉన్నారు. దీనికి భారత జనాభా గణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ వివేక్ జోషి సారథ్యం వహిస్తారు.)
- అసోం
- నాగాలాండ్
- మణిపూర్
- మేఘాలయ
14
6. డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ)కు చెందిన రక్షణ సాంకేతికతలు - పరీక్ష కేంద్రం, బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కేంద్రాలకు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎక్కడ శంకుస్థాపన చేశారు?
- లఖ్ నవూ
- కాన్పూర్
- ఘజియాబాద్
- అయోధ్య
21
8. కిందివాటిలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి క్షిపణి సామర్థ్య యుద్ధనౌకగా గుర్తింపు పొందింది. ఏది? (ముంబయిలోని మజగావ్ డాక్ లో తయారైన ఈ యుద్ధనౌక 1989లో భారత నౌకాదళంలో చేరింది. దీన్ని ఇకపై వాడకూడదని ఇటీవల ప్రభుత్వం నిర్ణ యించింది. )
- ఐఎన్ఎస్ తల్వార్
- ఐఎన్ఎస్ ఖుక్రీ
- ఐఎన్ఎస్ గోమతి
- ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర
30