1. పార్లమెంటు సాధారణ మెజారిటీ పద్ధతి ద్వారా రాజ్యాంగంలోని ఏ అంశాన్నిసవరించగలదు?
ఎ) రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ → ఆర్టికల్ 3
బి) రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఏర్పాటు/ తొలగింపు → ఆర్టికల్ 169
సి) నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఆర్టికల్ 82
డి) పార్లమెంటు సమావేశాల నిర్వహణకు ఆర్టికల్ 100 కోరం
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
4
2. పార్లమెంటు 'ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి' ద్వారా రాజ్యాంగంలోని ఏ అంశాన్ని సవరించగలదు?
ఎ) ప్రాథమిక హక్కులు ఆర్టికల్స్ 12 నుంచి 35
బి) ఆదేశిక సూత్రాలు → ఆర్టికల్స్ 36 నుంచి 51
సి) ప్రాథమిక విధులు - ఆర్టికల్ 51(ఎ)
డి) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించడం → ఆర్టికల్ 124
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
5
3. పార్లమెంటు 'ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి'' ద్వారా రాజ్యాంగంలోని ఎ అంశాన్ని సవరించగలదు?
ఎ) కేంద్ర కార్యనిర్వాహకవర్గ అధికార పరిధిని విస్తృతం చేయడం → ఆర్టికల్ 73
బి) రాష్ట్ర కార్యనిర్వాహకవర్గ అధికార పరిధిని విస్తృతం చేయడం → ఆర్టికల్ 162
సి) రాజ్యాంగ సవరణ విధానంలో మార్పులు, చేర్పులు → ఆర్టికల్ 368
డి) రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం → ఆర్టికల్ 80, 81
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
12
5. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్ని అయినా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలగకుండా పార్లమెంటు సవరించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు వెలువరించింది?
ఎ) కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు (1973)
బి) ఎ.డి.ఎం. జబల్పూర్ Vs శుక్లా కేసు (1976)
సి) మహ్మద్ హనీఫ్ ఖురేషి Vs స్టేట్ ఆఫ్ బిహర్ కేసు (1958)
డి) స్టానిలెస్ Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు (1977)
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
17
6. రాజ్యాంగ సవరణకు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు.
బి) రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశ పెట్టాలి.
సి) రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదం విషయంలో లోక్ సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయసభల సంయుక్త సమావేశంలో ఓటింగ్ నిర్వహిస్తారు.
డి) రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
21
8. 24వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) ఆర్టికల్, 368కి 1, 3 క్లాజ్‌లను చేర్చారు.
బి) మౌలిక రాజ్యాంగంలోని ఆర్టికల్ 368ను ఆర్టికల్ 368 (2)గా మార్చారు.
సి) పార్లమెంటు ఆమోదించి పంపిన రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపగలరు.
డి) ఆర్టికల్ 368 (2) ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్సభలోగాని, రాజ్యసభలోగాని ప్రవేశ పెట్టవచ్చు.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
30