3. కిందివాటిలో 'భారత స్వాతంత్ర్య చట్టం, 1947'లోని సరైన అంశాలను గుర్తించండి.
ఎ) భారత్, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు అవతరించాయి.
బి) భారతదేశానికి గవర్నర్ జనరల్ గా లార్డ్ మౌంట్ బాటన్ నియమితులయ్యారు.
సి) పాకిస్థాన్ గవర్నర్ జనరల్ గా మహ్మద్ అలీ జిన్నా నియమితులయ్యారు.
డి) భారత యూనియన్ పై బ్రిటిష్ సార్వభౌమాధికారం కొంతకాలం కొనసాగుతుంది.
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- బి, సి, డి
- పైవన్నీ
9
4. కిందివాటిలో 'భారత ప్రభుత్వ చట్టం, 1947'కి సంబంధించి సరైనవి ఏవి?
ఎ) బ్రిటిష్ రాజు, రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దయ్యింది.
బి) సుమారు 562 స్వదేశీ సంస్థానాలు స్వాతంత్ర్యం పొందాయి.
సి) భారతదేశంలో 554 స్వదేశీ సంస్థానాలు విలీనమయ్యాయి.
డి) బ్రిటిష్ కామన్వెల్త్ లో సభ్యత్వం పొందడం అనేది రెండు దేశాల అభీషానికి వదిలి పెట్టారు..
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
16
5. కిందివాటిలో చార్టర్ చట్టం, 1813కి సంబంధించి సరైనవి ఏవి?
ఎ. భారత్ లో విద్యావృద్ధికి సంవత్సరానికి లక్ష రూపాయలు కేటాయించారు.
బి. ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలకు అనుమతి నిరాకరించారు.
సి. పన్నులు విధించడానికి, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకోవడానికి స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అధికారాన్ని కల్పించారు.
డి. భారత్ లోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశానికి అవకాశం కల్పించారు.
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- ఎ, బి, సి, డి
- ఎ, సి, డి
20
7. చార్టర్ చట్టం, 1833కి సంబంధించి కిందివా టిలో సరైనవి ఏవి?
ఎ. బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి పేరును 'భారతదేశ గవర్నర్ జనరల్'గా మార్చారు.
బి. భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు.
సి. భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ గా విలియం బెంటింక్ వ్యవహరించారు.
డి. భారతదేశ గవర్నర్ జనరలకు ఆర్థిక, సివిల్, మిలటరీ అధికారాలు రద్దు చేశారు.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, బి, సి, డి
- ఎ, డి
25
9. కిందివాటిలో చార్టర్ చట్టం, 1833కి సంబంధించి సరైనవి ఏవి?
ఎ. బొంబాయి, మద్రాస్ ప్రభుత్వాల శాసనాధికారాలను తొలగించారు.
బి. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో న్యాయసభ్యుడిగా లార్డ్ మెకాలేకు ప్రాతినిధ్యం కల్పించారు.
సి. ఈస్టిండియా కంపెనీని ఒక పరిపాలనా సంస్థగా మార్పు చేశారు.
డి. తేయాకు, చైనాతో వ్యాపారాన్ని ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యం నుంచి తొలగించారు.
- ఎ, బి, సి, డి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
33