1. 'భారత ప్రభుత్వ చట్టం, 1858'కి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) సివిల్ సర్వీసెస్ పరీక్షలపై అధ్యయనం కోసం 'లార్డ్ మెకాలే' కమిటీని ఏర్పాటు చేశారు.
బి) భారత్ లో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయ్యింది. ,
సి) మొదటి గవర్నర్ జనరల్, వైస్రాయ్ గాలార్డ్ కానింగ్ వ్యవహరించారు.
డి) వైస్రాయ్ మనదేశంలో బ్రిటిష్ రాణి మొట్టమొదటి ప్రత్యక్ష ప్రతినిధి.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- బి, సి, డి
- పైవన్నీ
3
4. కిందివాటిలో 'మాంటేగ్-చెమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం, 1919'కి సంబంధించి సరైనవి ఏవి?
ఎ) కేంద్ర శాసన వ్యవస్థలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశ పెట్టారు.
బి) 'భారత హైకమిషనర్' అనే పదవిని సృష్టించారు.
సి) భారత రాజ్య కార్యదర్శి జీతభత్యాలను భారతదేశ రెవెన్యూ నుంచే చెల్లించాలని నిర్ణయించారు.
డి) కేంద్ర బడ్జెట్ నుంచి మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్ను వేరుచేశారు.
- ఎ, సి, డి
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- పైవన్నీ
15
5. కిందివాటిలో 'మాంటేగ్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం, 1919'కి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.
ఎ) సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ ను వేరు చేశారు.
బి) 'పబ్లిక్ అకౌంట్స్ కమిటీ' అనే పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు.
సి) మహిళలకు ఓటుహక్కును కల్పించే అంశాన్ని ప్రొవిన్షియల్ శాసనసభలకు అప్పగించారు.
డి) కేంద్ర, రాష్ట్రాల మధ్య 3 రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
17
7. కిందివాటిలో సైమన్ కమిషన్ సిఫార్సులను గుర్తించండి.
ఎ) భాషా ప్రాతిపదికన ఒడిశా, సింధు రాష్ట్రా లను ఏర్పాటు చేయడం.
బి) భారత్ లో సమాఖ్యతరహా విధానాన్ని ఏర్పాటు చేయడం.
సి) రాష్ట్రాల్లో అమల్లో ఉన్న 'ద్వంద్వపాల నను' రద్దు చేయడం.
డి) భారతీయులకు సార్వజనీన వయోజన ఓటు హక్కును నిరాకరించడం సమంజసమే.
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
28