2. ఆకర్షణీయ నగరాల ఛాలెంజ్ పోటీలో తొలి జాబితాలో 20 నగరాలను 2016, జనవరి 28న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కిందివాటిలో ఏ నగరం ఈ జాబితాలో లేదు?
- విశాఖపట్నం
- కాకినాడ
- తిరుపతి
- చెన్నై
7
5. గూగుల్ ఇండియా, భారతీయ రైల్వేకు చెందిన రైల్ టెల్ సంస్థలు సంయుక్తంగా ఉచిత వైఫై సౌకర్యాన్ని భారతదేశంలో కల్పించాయి. 2016, జనవరి 23న కేంద్ర రైల్వేశాఖా మంత్రి సురేశ్ ప్రభు దీన్ని ప్రారంభించారు. అయితే మనదేశంలో మొదటి వేగవంతమైన వైఫై సౌకర్యం ఉన్న రైల్వే స్టేషన్ ఏది?
- ముంబయి చర్చి గేట్
- ముంబయి సెంట్రల్
- చెన్నై సెంట్రల్
- అహ్మదాబాద్
18
11. 2016, మార్చి 22న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లలో 35 మంది మృతి చెందారు. బ్రస్సెల్స్లోని విమానాశ్రయ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ విమానాశ్రయం పేరేంటి?
- శాన్మారియో
- జావెన్టెమ్
- హీతు
- సువర్ణభూమి
42
12. 2016, మార్చిలో BARC అనే సంస్థ కొత్త రకం కంది వంగడాన్ని తయారు చేసింది. దాని పేరు TT - 401. TT అంటే ట్రాంబేతూర్. ఇది హెక్టారుకు 2550 కిలోల దిగుబడిని ఇస్తుంది. అయితే దీన్ని ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు?
- మహారాష్ట్ర .
- మధ్యప్రదేశ్
- ఆంధ్రప్రదేశ్
- తమిళనాడు
48
18. ఇటీవల నీటిని శుభ్రపరచడానికి ఉపయోగించే బయోపాలిమర్ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ టెక్నాలజీ సంస్థ శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఈ సంస్థ ఏ నగరంలో ఉంది?
- న్యూదిల్లీ
- బెంగళూరు
- భువనేశ్వర్
- గువాహటి
72