6. శిశువులందరిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమయ్యి క్రమంగా పదాలు నేర్చుకొని తర్వాత సంభాషణలు చేస్తూ పిదప సంక్లిష్టమైన భాషా నైపుణ్యాలను పెంపొందించుకుంటాడు. దీనిని బలపరిచే వికాస నియమము ?
7. ప్రజ్ఞ అనే SGT ఉపాధ్యాయులు తన పాఠశాలలోని విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను బోధించిన తర్వాత తనకు SA ప్రమోషన్ రావడంతో కేవలం ఒకే ఒక సబ్జెక్టును విద్యార్థులకు బోధించడం ప్రారభించింది. దీనిలో ఇమిడిఉన్న వికాస నియమo ?
8. సుమ, శ్రావణి ఇద్దరు SGT ఉపాధ్యాయురాళ్లే అయినప్పటికీ సుమ గణితంను విద్యార్థులకు చక్కగా బోధించగలదు కాని శ్రావణి మాత్రం సైన్సు సబ్జెక్టును చక్కగా బోధించగలదు. దీనికి కారణమైన వికాస నియమo ?
9. వ్యాయామ ఉపాధ్యాయుడు 5వ తరగతి చదువుతున్న "ఐశ్వర్యను" క్రీడలు ఆడేటప్పుడు ఆమె ఆట విధానం చూసి నీవు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అథ్లెట్ అవుతానని ప్రోత్సహించెను. ఇక్కడ ఉపయోగపడ్డ వికాసం నియమం ?
10. ఉపాధ్యాయుడు గణితంలో భాగంగా విద్యార్థులకు ముందుగా సహజ సంఖ్యలు, తర్వాత పూర్ణాంకాలు తర్వాత పూర్ణ సంఖ్యలు తర్వాత కరణీయ, అకరణీయ సంఖ్యలు తర్వాతనే వాస్తవ సంఖ్యలను నేర్పించాడు. అయితే ఉపాధ్యాయుడు పాటించిన నియమం ?